Terrorist Killed : జమ్మూకశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం అయ్యాడు. బారాముల్లాలో పోలీసులతో కలిసి సైనిక బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

10TV Telugu News

Encounter in Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. బారాముల్లాలోని చెర్దారీలో పోలీసులతో కలిసి.. సైనిక బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడని కశ్మీర్ పోలీసు ఐజీ విజయ్ కుమార్ ప్రకటించారు.

ఎన్‌కౌంటర్ అయిన ఉగ్రవాది జావేద్ అహ్ వానీగా గుర్తించామని, ఇతను కుల్గామ్ జిల్లాకు చెందిన వ్యక్తి అని చెప్పారు పోలీసులు. జావేద్ ఈ నెల 20న పౌరులను టార్గెట్ చేసిన.. గుల్జర్‌ అనుచరుడు. స్థానికంగా పౌరులను టార్గెట్ చేసేందుకు అతను ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. చనిపోయిన ఉగ్రవాది నుంచి ఒక పిస్టల్, లోడెడ్ మ్యాగజైన్, పాక్ గ్రెనెడ్ ను స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

Supreme Court : నీట్‌ యూజీ ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్

గతంలో వలసకూలీల హత్యల్లో ఈ ఉగ్రవాది జావేద్ పాల్గొన్నాడని పోలీసులు చెప్పారు. బారాముల్లాలో ఒక దుకాణదారుడిని లక్ష్యంగా చేసుకొని దాడిచేసే పనిలో ఉండగా ఎన్‌కౌంటరులో హతం అయ్యాడు.