CM KCR in Assembly : పోడు భూములకు పట్టాలే కాదు పోడు రైతులకు ‘రైతుబంధు’ కూడా ఇస్తాం : సీఎం కేసీఆర్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పోడు భూముల గురించి మాట్లాడుతూ..పోడు భూముల రైతులకు శుభవార్త చెప్పారు. శుభవార్తతో పాటు కొన్ని షరతులు కూడా పెట్టారు. పోడు భూముల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..పోడు భూములకు పట్టాలే కాదు పోడు రైతులకు ‘రైతుబంధు’ కూడా ఇస్తాం అని హామీ ఇచ్చారు.

CM KCR in Assembly :  పోడు భూములకు పట్టాలే కాదు పోడు రైతులకు ‘రైతుబంధు’ కూడా ఇస్తాం : సీఎం కేసీఆర్

CM KCR's speech in the assembly about podu lands

CM KCR in Assembly : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పోడు భూముల గురించి మాట్లాడుతూ..పోడు భూముల రైతులకు శుభవార్త చెప్పారు. శుభవార్తతో పాటు కొన్ని షరతులు కూడా పెట్టారు. పోడు భూముల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..పోడు భూములకు పట్టాలే కాదు పోడు రైతులకు ‘రైతుబంధు’ కూడా ఇస్తాం అని హామీ ఇచ్చారు. కానీ పోడు భూములు మావే అని వాటిపై సర్వహక్కులు మావేనని అనటం సరికాదని..అడవులు నరకం అని మాకు హామీ ఇస్తేనే ప్రభుత్వం పోడు భూములు ఇస్తాం అని స్పష్టంచేశారు. పోడు భూముల గురించి గిరిజనులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని అడవులను నరికివేస్తూ పోడుభూములపై హక్కులు మావేననటం సరికాదన్నారు.

అటవీ సంపదను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంత ఉందో అడవుల్లోనే జీవించే గిరిజనులకు కూడా అంతే ఉంటుందని అడవులను పరిరక్షించుకోవాల్సిన అసవరం ఉందని అన్నారు. అడవుల పునరుజ్జీవన ప్రక్రియ పెంచే ప్రయత్నం చేస్తున్నామని దానికి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.పోడు భూములపై మా ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉందని..పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. దాదాపు 66లక్షల ఎకరాలు పోడు భూములు ఉన్నాయని..వీటిపై అన్నిరకాలుగా సర్వేలు జరిగాయని వాటికి సంంధించి నివేదికలు కూడా అందాయని.. పోడు భూములు సాగు చేసుకునే రైతులకు వాటికి పట్టాలిస్తామని తెలిపిన సీఎం కేసీఆర్ వాటిని ఇప్పటికిప్పుడు పోడు భూముల పంపిణీ చేయటం అంటే అయ్యేపని కాదని దీని కోసం సమయం పడుతుందని అన్ని విధివిధానాలు రూపొందించి ఇస్తామని స్పష్టంచేశారు. అలాగే పట్టాలు ఇచ్చాక  కూడా అడవులను ధ్వంసం చేస్తే ఇచ్చిన పట్టాలని వెనక్కి తీసేసుకుంటామని కూడా హెచ్చరించారు.

పోడుభూములు సాగు చేసుకునే రైతులు పట్టాలు పొందాలంటే ఆ భూముల్ని అడవుల్ని పరిరక్షించాలని..అడవులు నరకం అని ప్రభుత్వానికి గిరిజనులు హామీ ఇస్తేనే ప్రభుత్వం పోడు భూములు ఇస్తుంది అని స్పష్టంచేశారు.అడవులు ఇష్టానుసారంగా నరికేసి వాటిపై మాకే హక్కులు ఉన్నాయి అనటం సరికాదని అలా అంటే అది హక్కు కాదని అన్నారు.

పోడు భూముల్ని రక్షించటానికి వెళ్లే ఫారెస్ట్ అధికారులపై దాడులు చేయటం గాయపరచటమే కాకుండా ఏకంగా ప్రాణాలే తీసేస్తున్నారని గుత్తికోయలు చేసే ఇటువంటి దారుణాలు మానకోవాలని హితవు పలికారు కేసీఆర్. గిరిజనుల శ్రేయస్సు కోరి అన్ని ప్రభత్వపరంగా నిర్ణయం తీసుకుంటామని కాబట్టి గిరిజనులు సంయమనం పాటించాలని సూచించారు. పోడు భూముల పంపిణీ గురించి అఖిల పక్ష సమావేశం చేస్తామని ఆ తరువాతే భూముల పంపిణీ చేస్తామని..
11లక్షల ఎకరాలు పంపిణీ చేయానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు సీఎం కేసీఆర్.

పోడు భూముల పంపిణీ అంశాన్ని రాజకీయం చేయొద్దు అంటూ విపక్షాలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఈ పంపిణీ ఎన్నికల కోసమో, రాజకీయాల కోసమో కాదని ఇది కేవలం గిరిజనుల సంక్షేమం కోసమేనని అన్నారు. పోడు భూముల పంపిణీ అనేది చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని దీన్ని రాజకీయాల కోసం తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. పోడు భూములు సాగు చేసుకునే రైతులకు పట్టాలే కాదు ‘రైతు బంధు’ పథకాన్ని కూడా వారికి అమలు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

Podu farmers