ఏపీలో 76 శాతం రికవరీ కేసులతో విశాఖ జిల్లా టాప్

  • Published By: sreehari ,Published On : April 21, 2020 / 10:51 AM IST
ఏపీలో 76 శాతం రికవరీ కేసులతో విశాఖ జిల్లా టాప్

Updated On : April 21, 2020 / 10:51 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కానీ, కొన్ని జిల్లాల్లో కరోనా నుంచి కోలుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇతర జిల్లాల్లో కంటే విశాఖపట్నంలో 76 శాతం రికవరీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో అత్యధికంగా విశాఖ టాప్ రేటులో నిలిచింది. విశాఖలో 21 మంది కరోనా బాధితుల్లో ఇప్పటికే 16 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆదివారం నాటికి కొన్ని కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. వచ్చే వారంలో మరికొంతమంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్చి అయ్యే అవకాశం ఉంది. 

ఏపీలో ఇతర జిల్లాల్లో మార్చి నాటికి చాలా పాజిటివ్ కేసులు నమోదు కాగా, స్వల్పగా రికవరీ, డిశ్చార్జీ రేటు సున్నా నుంచి 15 శాతం మధ్యలో ఉంది. కరోనా పేషెంట్లలో కూడా ఇప్పటివరకూ రికవరీ అయినవారిలో వివిధ వయస్సుల్లో 20 ఏళ్ల నుంచి 75 ఏళ్ మధ్య వారే ఎక్కువగా ఉన్నారు. నెల్లూరులో 67 కేసులు నమోదు కాగా ఒకరు మాత్రమే డిశ్చార్జి అయ్యారు. గుంటూరులో మొత్తం 129 కేసులు నమోదు కాగా, డిశ్చార్జి ఎంతమంది అవుతారో చూడాలి. కేరళలో కూడా 158 కేసులు నమోదు కాగా ఒకరు మాత్రమే డిశ్చార్జి అయ్యారు. 

ఇతర జిల్లాల్లో కడపలో (51శాతం) అత్యధిక రికవరీ రేటు రికార్డు కాగా, తూర్పు గోదావరిలో (33శాతం)గా నమోదైంది. అంతకుముందు వైజాగ్‌లో క్వారంటైన్ చర్యలు, సరైన ఐసోలేషన్, సకాలంలో బాధితులను గుర్తించడం, చికిత్స అందించింది. ఇందులో డాక్టర్ల కూడా పూర్తి స్థాయిలో సహాకారంతో అందించడంతో కరోనాను కట్టడి చేయడంలో వైజాగ్ విజయం సాధించింది. AMC ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ మాట్లాడుతూ.. ” ఇతర సంక్లిష్టత ఉన్న రోగులు ఉన్నప్పటికీ, వారు బాగా ఒంటరిగా ఉన్నారు.  

చాలా ముందుగానే నిర్బంధంలో ఉంచి పర్యవేక్షిస్తున్నాం. పాజిటివ్ పరీక్షించిన వారికి జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ కాకుండా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం, ద్రవాలు, విటమిన్ బి, సి కాంప్లెక్స్ ఇచ్చారు. రోగులకు కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. తద్వారా వారు నిరాశకు గురికాకుండా, తినడం మానేస్తారు’ అని చెప్పారు.  647 కేసులలో 65మంది డిశ్చార్జీ అయ్యారు.  AP రికవరీ రేటు 10శాతం కాగా, ఏప్రిల్ 19 నాటికి దేశం రికవరీ రేటు 14.1శాతంగా నమోదైంది.