Cm Chandrababu: రప్పా రప్పా నరికితే తప్పు లేదంటారా? అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి- సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ప్రతిపక్షంలో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో.. అధికారంలో ఉన్నప్పుడూ అంతకంటే బాధ్యతగా ఉండాలి.

Cm Chandrababu: రప్పా రప్పా నరికితే తప్పు లేదంటారా? అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి- సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Updated On : June 29, 2025 / 9:07 PM IST

Cm Chandrababu: ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో అంతర్గత సమావేశంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ తీరుని చంద్రబాబు తప్పుపట్టారు. ఐదేళ్లు ఏ పనీ చేయని వారు రీకాల్ అని మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎవరిని రీకాల్ చేయాలి? అని ప్రశ్నించారు. వైసీపీ చెప్పే అబద్ధాలను తిప్పి కొట్టాలంటే ఇంటింటికి వెళ్లండి అని ప్రజా ప్రతినిధులకు సూచించారు చంద్రబాబు. గంజాయి బ్యాచ్‌ను కాపాడాలనుకునే వారిని గంజాయి బ్యాచ్‌గానే పరిగణిస్తానని ఆయన తేల్చి చెప్పారు.

”ఒక మాజీ సీఎం, పార్టీ అధినేత.. రప్పా రప్పా నరికితే తప్పు లేదంటారా? అధికారంలోకి వస్తే పొట్టేళ్లు నరికినట్లు నరుకుతారా? తలలు నరికితే తప్పేంటని చెప్పే వ్యక్తుల మనస్థత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షంలో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో.. అధికారంలో ఉన్నప్పుడూ అంతకంటే బాధ్యతగా ఉండాలి. గంజాయి అమ్మేవారి ఆస్తులను జప్తు చేస్తాం. ఆ కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు నిలిపేస్తాం” అని చంద్రబాబు హెచ్చరించారు.

Also Read: విదేశాల్లో 15 మంది ఎమ్మెల్యేలు.. సీఎం చంద్రబాబు సీరియస్.. ఇక ఫారిన్‌లోనే ఉండటం మంచిదని చురకలు..

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీలో మేనిఫెస్టో అంశాలపై సుదీర్ఘ చర్చించారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన హామీలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశంపై సీఎం దిశా నిర్దేశం చేశారు. ఇక నాన్ సీరియస్ గా ఉన్న ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీఎం చురకలు అంటించారు. కొందరు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు నాకే సలహాలు ఇస్తున్నారంటూ చంద్రబాబు ఛలోక్తులు విసిరారు.

పని చేయకుండా సలహాలకే పరిమితమయ్యే ఎమ్మెల్యేలకు భవిష్యత్ నాయకులుగా ఉండలేరని తేల్చి చెప్పారు. సమావేశానికే రాని వారు.. మీ నియోజకవర్గాల్లో ఏం పవి చేస్తారు అని చంద్రబాబు ప్రశ్నించారు. అధినేత. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కారణంగా ప్రభుత్వ
సమీక్షల నుంచి మంత్రులకు వెసులుబాటు కల్పించారు. క్షేత్ర స్థాయిలో ఇంటింటికి ప్రచారం చేయాలంటూ చంద్రబాబు ఆదేశించారు.