CM Jagan Mourned : రోశయ్య మరణం ఎంతగానో బాధించింది : సీఎం జగన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోశయ్య మృతి బాధాకరం అన్నారు.

Cm Jagan Mourn
CM Jagan mourns to death of Konijeti Rosaiah : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోశయ్య మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, హీరో చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు పలువురు ప్రముఖులు రోశయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు.
హైదరాబాద్ లో కొణిజేటి రోశయ్య పార్థివదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. రోశయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. రోశయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాడ సానుభూతి ప్రకటించారు. రాజకీయాల్లో రోశయ్య తనదైన శైలిని ప్రదర్శించేవారని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య (88) గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఉదయాన్నే ఆయనకు గుండెపోటు రాగా బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మధ్యలోనే చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు. మంచి వక్తగా పేరుతెచ్చుకున్నాడు. ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై ఆయనకు మంచి పట్టు ఉంది.
తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు. తరువాత అనేకమంది ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైననూ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.
Pawan Kalyan Mourned : రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు : పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 2010 నవంబరు 24వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నర్‌గా పని చేశారు.