Kesineni Nani: టీడీపీ కోసం ఆస్తులు అమ్ముకున్నాను.. చివరకు నన్ను..: జగన్‌ను కలిశాక కేశినేని నాని సంచలన కామెంట్స్
నిజాయితీగా పార్టీ కోసం కష్టపడ్డానని చెప్పారు. తాను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లని చెప్పారు.

Kesineni Nani
టీడీపీ కోసం తాను ఆస్తులు అమ్ముకున్నానని, అయినప్పటికీ పార్టీలో అవమానాలు ఎదుర్కొన్నానని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. సీఎం జగన్‌ను కలిశాక కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోసగాడని ప్రపంచానికి తెలుసు’ అని అన్నారు.
సమస్యలు ఎదుర్కొంటానని చాలా మంది చెప్పినప్పటికీ నేను టీడీపీలోనే కొనసాగానని కేశినేని నాని అన్నారు. నిజాయితీగా పార్టీ కోసం కష్టపడ్డానని చెప్పారు. తాను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లని చెప్పారు.
కేశినేని కామెంట్స్
- విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను
- నా రాజీనామా లేఖను స్పీకర్‌కు మెయిల్ పంపుతాను
- పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నా
- చంద్రబాబు దగ్గర రూపాయి తీసుకోలేదు
- చంద్రబాబు అన్ని రకాలుగా అవమానించారు
- చెప్పుతో కొడతానని ప్రెస్‌మీట్ పెట్టి బాబు చెప్పించారు
- గొట్టంగాడు అని తిట్టినా భరించా
- జిల్లాలో కార్పొరేషన్లు, జెడ్పీ గెలిచాం
- చంద్రబాబు మోసగాడు కాదు.. పచ్చి మోసగాడు
- చంద్రబాబు ఇంత మోసగాడనుకోలేదు
- రాజీనామా ఆమోదించగానే వైసీపీలో చేరతా
- ఇక నా ప్రయాణం జగన్‌తోనే
- విజయవాడపై బాబుకు చిత్తశుద్ధి లేదు
- షాజహాన్ తాజ్‌మహల్.. చంద్రబాబు అమరావతి
- బాబు మోసగాడు..జగన్ పేదల పక్షపాతి
- విజయవాడ టీడీపీలో 60 శాతం ఖాళీ చేయిస్తా
- పాదయాత్ర చేయడానికి లోకేశ్‌కు అర్హత ఉందా?
- లోకేశ్‌కు నేను జీహుజూర్ అనాలా?
- జగన్ ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తా..
- NTR జిల్లాలో 60 శాతం టిడిపి కాళీ అవ్వబోతుంది..నాతో పాటు జగన్ వెంట వస్తారు..
- ఎంపీగా పోటీ అవకాశం ఇస్తారా? లేకా పార్టీ చుసుకోమంటారా? లేక ఖాళీగా ఉండమంటారా జగన్ ఇష్టం..
- లోకేశ్ మా కుటుంబంలో చిచ్చు పెట్టాడు.. లోకేశ్ కి ఏం అర్హత ఉంది పాదయాత్ర చెయ్యడానికి..
- లోకేశ్ ఆప్ట్రాల్ ఓడిపోయిన ఎమ్మెల్యే.. నేను ఎందుకు పాల్గొనాలి?
- పార్టీ కోసం లోకేశ్ ఏం చేశాడు.. ఆయనకి ఏం రైట్ ఉంది?
- ఏం అర్హత ఉంది పార్టీలో సీనియర్లను శాషిస్తున్నారు?
- టీడీపీ-జనసేన కూటమికి 40 సీట్లు కంటే ఎక్కువ రావు
Keshineni Nani : వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా బరిలోకి కేశినేని నాని?