జగన్ ఏపీని బీహార్‌లా మార్చేశారు

జగన్ ఏపీని బీహార్‌లా మార్చేశారు

Updated On : January 30, 2021 / 11:11 AM IST

nara lokesh on ap cm jagan: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ఏపీని బీహార్ లా మార్చేశారని మండిపడ్డారు. నాడు-నేడులో భాగంగా నాడు పచ్చని సీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్షన్‌ సీమ‌ చేశారని అన్నారు. జగన్ రాకముందే జగన్ వస్తాడని గాలి కబుర్లు చెప్పారు, ఇప్పుడు జగన్‌ కంటే ముందు ఆయ‌న పెంచి పోషిస్తోన్న ఇసుక‌ మాఫియా గ‌న్‌లతో వ‌చ్చి తూర్పుగోదావరి జిల్లాలో రెచ్చిపోయిందన్నారు. భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారని, గన్నులు పట్టుకొని ప్రజలపై పడ్డారని లోకేష్‌ విమర్శలు చేశారు.