Bunny Vas : జనసేన ప్రచార విభాగం ఛైర్మన్‌గా బన్నీ వాస్.. నియామక ఉత్తర్వులు అందజేసిన పవన్ కల్యాణ్
జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్‌గా నిర్మాత బన్నీవాస్ నియమితులయ్యారు.

Producer Bunny Vaas appointed as the chairman of the Janasena party campaign department
Bunny Vas – Pawan Kalyan : జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్‌గా నిర్మాత బన్నీవాస్ నియమితులయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియామక పత్రాన్ని అందజేశారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నియామక ఉత్తర్వులను స్వయంగా పవన్ కల్యాణ్ నిర్మాత బన్నీ వాస్‌కు అందజేశారు.
జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్ గా శ్రీ బన్నీ వాస్
* నియామక ఉత్తర్వులు అందజేసిన శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/j7J4q3qMiz
— JanaSena Party (@JanaSenaParty) December 14, 2023
TDP Janasena Strategy : టీడీపీ-జనసేన దూకుడు.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా త్రిశూల వ్యూహం
ప్రచార విభాగం పార్టీకి కీలకమైందన్నారు. సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని బన్నీవాస్‌కు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సూచించారు. పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వినూత్న కార్యక్రమాలను రూపొందించాలన్నారు. పార్టీ ఉన్నతి కోసం మరింతగా కష్టపడాలన్నారు. ఈ సందర్భంగా బన్నీ వాస్ కు పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు.