JC Prabhakar Reddy : నేను ఎవరికీ భయపడను, పెరుగన్నం తిని బతుకుతా..! జేసీ ప్రభాకర్ రెడ్డి
చాలా మంది మా గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. నేను ఎవరికీ భయపడను.

JC Prabhakar Reddy : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ప్రెస్టేజ్ కు పోవడంతోనే చాలా కోల్పోవాల్సి వచ్చిందని ఆయన వాపోయారు. ఐదేళ్లుగా జరిగిన పరిణామాలు, 6 నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతగానో బాధించాయని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఫ్లై యాష్ విషయంలో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ యాజమాన్యానికి క్షమాపణలు చెప్పారాయన.
సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి 30వేల మంది ఉన్నారని, వారి కోసమే తన తాపత్రయం అన్నారు. తాను డబ్బు కోసం రాజకీయం చేయడం లేదన్నారు. కేవలం ప్రెస్టేజ్ కోసమే పాలిటిక్స్ చేస్తున్నాని అన్నారు. తనకు చీము, నెత్తురు ఉన్నాయన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. తాను ఎవరికీ తలవంచనని స్పష్టం చేశారు.
‘ఈరోజు నేను బాధతో మాట్లాడేందుకు వచ్చా. నా మనవళ్లు, మనవరాళ్లు ఏడ్వని రోజు లేదు. నా కూతుళ్లు ఏడ్వని రోజు లేదు. మా అన్నకి ఇవాళ హెల్త్ బాగోలేదు అంటే.. నా గురించి ఆలోచన చేసి చేసి అలా అయిపోయాడు. వాళ్లకే కాదు మాకు కూడా ఉంటాయి ప్రెస్టేజ్ లు. మేమూ చీము, నెత్తురు కలిగిన వాళ్లమే. నాకు చీము, రక్తం ఎక్కువ ఉంది. మా లారీ వాళ్లు, ఎంప్లాయ్స్, వర్కర్స్ కష్టపడ్డారు, నష్టపోయారు కూడా.
Also Read : మన్మోహన్ సింగ్ పై సినిమా వచ్చింది తెలుసా? అందులో మన్మోహన్ పాత్రలో ఎవరు నటించారో తెలుసా?
అందువల్లే మా పిల్లలు, నా భార్య చెప్పినదాంట్లో అర్థం ఉంది కాబట్టే ఈరోజు నేను సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి క్షపమాణ చెబుతున్నా. గత ఐదేళ్లు నేను అవస్థలు పడ్డాను. మా ఊరి జనం కోసం, నన్ను నమ్మిన జనం కోసం కష్టపడ్డాను. నాకు ఏ పార్టీ నాయకుడు చెప్పలేదు. ఇలా చేయాలని, అలా చేయాలని చెప్పలేదు. గడిచిన ఐదేళ్లు నేను చాలా నష్టపోయాను. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
నాకు, వైఎస్ కుటుంబానికి సన్నిహితం ఉన్నింది, పోయింది. చాలా మంది మా గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. నేను ఎవరికీ భయపడను. నా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాను’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Also Read : మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? ఆయన ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తున్నారంటే..