Tirumala Alert : తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఇకపై దివ్య దర్శనం టిక్కెట్లు అక్కడ మాత్రమే ఇస్తారు

TTD Alert : భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలని టీటీడీ స్పష్టం చేసింది.

Tirumala Alert : తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఇకపై దివ్య దర్శనం టిక్కెట్లు అక్కడ మాత్రమే ఇస్తారు

Tirumala Alert (Photo : Google)

Tirumala Alert : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) ముఖ్య గమనిక చేసింది. ఇకపై దివ్య దర్శనం టోకెన్లు భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తామని టీటీడీ ప్రకటించింది. ఎస్.ఎస్.డీ టోకెన్ కౌంటర్ విష్ణు నివాసానికి తరలించారు. అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తారు.

ఇకపై అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టిక్కెట్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం 2083వ మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాలని కోరారు. లేకుంటే స్లాటెడ్ దర్శనానికి అనుమతించబడరని టీటీడీ తేల్చి చెప్పింది.

Also Read..Tirumala : తిరుమలలో కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు.. మూడేళ్ల తర్వాత పున:ప్రారంభం

భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలని టీటీడీ స్పష్టం చేసింది. మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరని టీటీడీ తేల్చి చెప్పింది. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు యథా ప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారని టీటీడీ వెల్లడించింది.

తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీ ఇటీవలే పున: ప్రారంభమైంది. కరోనా కారణంగా మూడేళ్లగా దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. భక్తుల కోరిక మేరకు అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద రోజుకు 10వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 1250వ మెట్టు చెంత రోజుకు 5వేల దివ్యదర్శనం టోకెన్లను కేటాయిస్తున్నారు. భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టోకెన్లు జారీ చేస్తారు. కొన్ని రోజుల పాటు ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ పరిశీలించనుంది.

Hanuman Jayanti 2023 : హనుమంతుడి దేహమంతా ‘సింధూరం పూత’ వెనుక సీతమ్మ తల్లి చెప్పిన రహస్యం..

గతంలో అలిపిరి మార్గంలో నడిచి వచ్చే భక్తులకు గాలి గోపురం వద్ద 14 వేల టోకెన్లు అందుబాటులో ఉంచిన టీటీడీ.. ప్రస్తుతం 10 వేలు టికెట్లు ఇస్తోంది. అదే విధంగా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వచ్చే భక్తులకు గతంలో 6 వేల టికెట్ల ఇస్తుండగా.. ఇప్పుడు 5 వేల టోకెన్లు జారీ చేస్తున్నారు.

ఇక, వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులకు అలిపిరి వద్ద ఉన్న భూదేవి, అలాగే బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ లతో పాటు రైల్వే స్టేషన్ సమీపంలో గల విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్ర సముదాయాల వద్ద సర్వదర్శనం టోకెన్లు ఇస్తోంది టీటీడీ.