చమురు సంక్షోభం : పెరుగుతున్న పెట్రో ధరలు

  • Published By: madhu ,Published On : September 23, 2019 / 04:07 AM IST
చమురు సంక్షోభం : పెరుగుతున్న పెట్రో ధరలు

Updated On : September 23, 2019 / 4:07 AM IST

పెట్రో దరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత ఆరు రోజుల్లో పెట్రోల్ లీటర్‌కు రూ. 1.59, డీజిల్ రూ. 1.31 పెరిగింది. సౌదీ ఆరామ్ డ్రోన్ దాడి ఇందుకు కారణం. తూర్పు సౌదీ అరేబియాలోని అబ్‌కైక్‌, ఖురైస్‌లో ఉన్న ఆరాంకో ప్లాంట్లపై యెమనీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో ఇటీవలే దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 73.91గా ఉంది. అదే సెప్టెంబర్ 23వ తేదీ ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ. 73.62గా ఉంది. సోమవారం లీటర్ డీజిల్ ధర రూ. 66.93గా ఉంది. ఆదివారం రూ. 66.74గా ఉంది. సెప్టెంబర్ 17 నుంచి పెట్రో ఉత్పత్తుల ధరలు ప్రపంచ వ్యాప్తంగా మండిపోతున్నాయి.

సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ధరలు ఇలా ఉన్నాయి : – 

నగరం పెట్రోల్ డీజిల్
ఢిల్లీ రూ. 73.91 రూ. 66.93
కోల్ కతా రూ. 76.60 రూ. 69.35
చెన్నై రూ. 76.83 రూ. 70.76
ముంబై రూ. 79.57 రూ. 70.22
బెంగళూరు రూ. 72.96 రూ. 69.21
హైదరాబాద్ రూ. 78.57 రూ. 72.96
చిత్తూరు రూ. 78.25 రూ. 72.57
కడప రూ. 77.75 రూ. 71.82
విశాఖపట్టణం రూ. 77.26 రూ. 71.34
విజయనగరం రూ. 78.45 రూ. 72.44
అనంతపురం రూ. 78.25 రూ. 72.30

సౌదీ ప్రభుత్వ చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్‌ దాడులతో ఆ దేశం చమురు ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది. యుద్ధం మొదలైతే అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్న అనుమానాలు ఏర్పడటంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 20 శాతం వరకు పెరిగిపోయాయి. భారత్‌కు రెండో అతి పెద్ద చమురు సరఫరాదారు సౌదీ అరేబియానే. భారత్‌ చమురు అవసరాల్లో 83 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి, భారత్‌కు కొద్ది రోజులకు సరిపడా ఆయిల్‌ రిజర్వులున్నాయని అంచనా. అవి పూర్తయ్యేలోగా సంక్షోభం సమసిపోతే చమురు ధరలు దిగి వస్తాయంటున్నారు. 
Read More : గుడ్ న్యూస్ : తక్కువ ధరకే కార్లు, బైకులు!