అసోంలో కొండచరియలు విరిగిపడి 20మంది మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : June 2, 2020 / 09:20 AM IST
అసోంలో కొండచరియలు విరిగిపడి 20మంది మృతి

Updated On : June 2, 2020 / 9:20 AM IST

అసోంలో కొండచరియలు విరిగిపడి దాదాపు 20మంది ప్రానాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ అసోంలోని బరాక్ లోయ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలియగానే. రెస్క్యూ టీమ్స్ ఈ కొండ చరియల్ని తొలగించే ఆపరేషన్ ప్రారంభించింది.

బండరాళ్ల కింద ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు. చనిపోయిన వారిలో… 7గురు కచార్ జిల్లాకు చెందిన వారు. మరో ఏడుగురు హైలకండి జిల్లాకు చెందినవారు. మరో ఆరుగురు కరిమ్‌గంజ్ జిల్లాకు చెందిన వారని తెలిసింది. చనిపోయినవారిలో నలుగురు మనర్లు కూడా ఉన్నట్లు సమాచారం.

కొన్ని రోజులుగా బరాక్ లోయ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలే కొండచరియలు విరిగిపడటానికి కారణంగా తెలుస్తోంది. ఇంకా వర్షాకాలం రాకపోయినా… ఇటీవల ఇక్కడ ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల భారీ వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే… నైరుతీ రుతుపవనాలు వచ్చాక… ఇంకెన్ని విషాదాలు జరుగుతాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఈశాన్య రాష్ట్రంలో ఇప్పటికే తరచూ వరదలు వచ్చి… 3.72 లక్షల మంది బాధితులయ్యారు. ముఖ్యంగా గోల్పారా జిల్లా… అత్యంత ఎక్కువగా దెబ్బతింది. ఆ తర్వాత నాగావ్, హోజాయ్ జిల్లాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. 

Read: అరేబియా సముద్రంలో మరింత బలపడిన నిసర్గ తుపాన్