Molesting On Minor Girl : బాలికపై 4 రోజులుగా అత్యాచారం… రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

కూతుళ్ల  పెళ్లి చేసిన   విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఇంటి పక్కనే ఉండే మైనర్ బాలికపై కన్నేసి నాలుగు రోజులుగా అత్యాచారం చేస్తున్నాడు.

Molesting On Minor Girl : బాలికపై 4 రోజులుగా అత్యాచారం… రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

Wgl Molestation

Updated On : October 20, 2021 / 2:07 PM IST

Molesting On Minor Girl :  కూతుళ్ల  పెళ్లి చేసిన   విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఇంటి పక్కనే ఉండే బాలికపై కన్నేసి నాలుగు రోజులుగా అత్యాచారం చేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు.

హనుమకొండ జిల్లా కేంద్రంలోని పరిమళకాలనీలో బింగి బిక్షపతి అనే వ్యక్తి  విద్యాశాఖలో సూపరింటెండెంట్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. అతని భార్య ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.  ఈ దంపతులు కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేసేశారు.  ఒంటరిగా ఇంట్లో ఉంటున్న భిక్షపతి పక్కింట్లో ఉండే 8 వతరగతి చదువుతున్న బాలికపై  కన్నేశాడు.

ఎలాగైనా బాలికను లొంగదీసుకుని తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. బాలికకు వివిధ రకాల వస్తువులు కొనిస్తూ తన వలలో వేసుకున్నాడు. నాలుగు రోజులుగా బాలికపై లైంగిక దాడి చేస్తున్నాడు. బాలిక  నాలుగు రోజులుగా క్రమం తప్పకుండా భిక్షపతి ఇంటికి వెళ్ళటం బాలిక బంధువు గమనించింది.

Also Read : School Girl Suicide : డ్యాన్స్ నేర్చుకోవటం ఇష్టంలేక …

ఈవిషయం ఆనోటా, ఈనోటా కాలనీ  అంతా పాకింది. మంగళవారం బాలిక భిక్షపతి ఇంటికి వెళ్లటం  గమనించిన కాలనీ వాసులు 100 కు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ఘటనా స్ధలానికి  చేరుకున్నపోలీసులు బాలికపై అత్యాచారం చేస్తున్న  భిక్షపతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.