SI ప్రాథమిక కీ : మే 2న కానిస్టేబుల్ డ్రైవింగ్ టెస్టు

సబ్ ఇన్స్‌పెక్టర్ (ఎస్ఐ) రాత పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేసినట్లు బోర్డు ఛైర్మన్ వెల్లడించారు. ఏప్రిల్ 20, 21 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి రిక్రూట్ మెంట్ రాత పరీక్ష జరిపిన సంగతి తెలిసిందే. 5 సబ్జెక్టులకు సంబంధించిన ‘కీ’లను వెబ్ సైట్ (www.tslprb.in)లో పొందుపరచినట్లు తెలిపారు. అభ్యర్థులు ఏప్రిల్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అభ్యంతరాలను తెలియచేయవచ్చని తెలిపారు.
ఇక ఇదిలా ఉంటే దేహధారుడ్య పరీక్షల్లో పాస్ అయిన ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ (డ్రైవర్లు) అభ్యర్థులకు డ్రైవింగ్ టెస్టు జరుగనుంది. మే 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు పరీక్ష ఉంటుంది. అంబర్ పేటలో నిర్వహిస్తారు. ఎస్‌సీటీ పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) అభ్యర్థులకు మే 9 నుంచి మే 10 వరకు ట్రేడ్ టెస్టు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు https://www.tslprb.in/ వెబ్ సైట్ నుండి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది.