కరోనా సోకితే.. తీవ్రమైన కంటి సమస్య.. చూపు కోల్పోవచ్చు: వైద్యుల హెచ్చరిక!

COVID-19 Might Cause Severe Eye Problem : ప్రపంచమంతా కరోనాతో వణికిపోతోంది. రోజురోజుకీ కరోనా కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో వైరస్ బాధితుల్లో చాలామందిలో అసాధారణ లక్షణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా లక్షణాల్లో నిరంతరయంగా వెక్కిళ్లు వస్తున్నాయని ఇటీవలి కొత్త అధ్యయనంలో తేలింది. బహుషా కరోనా లక్షణాల్లో వెక్కిళ్లు అనేది అరుదైన లక్షణంగా వైద్యులు చెబుతున్నారు. అలాగే ఇప్పుడు కరోనా బాధితుల్లో తీవ్రమైన కంటిసమస్యకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా సోకిన ఇతర పేషెంట్లలో చాలామందిలో వైరస్ తగ్గిపోయాక కూడా దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు లేదా నిరంతం కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.
కొంతమందిలో కరోనా నుంచి కోలుకున్నాక ఎలాంటి నొప్పి లేదా రక్తస్రావం లేకుండానే పళ్లు ఊడిపోతున్నాయని వైద్యులు గుర్తించారు. కరోనా బాధితుల్లో తీవ్రమైన కంటి సమస్య ముప్పు ఉందని Ophthalmologists హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. ముగ్గురు కరోనా బాధితుల్లో చికిత్స పొందిన రెండు నెలల తర్వాత వారిలో keratitis అనే సమస్య వచ్చినట్టు వైద్యులు తెలిపారు.
ఈ సమస్య ఉన్నవారిలో కార్నియాలో వాపు రావడంతో భరించలేని మంటగా ఉన్నట్టు అనుభవించారు. మహమ్మారి ప్రారంభంలో కూడ చాలామంది కరోనా బాధితుల్లో పింక్ కలర్ కన్ను లేదా కండ్లకలక సమస్యలను వైద్యులు, నర్సులు గుర్తించారు. కరోనా వైరస్ కంటిపై ప్రభావం చూపుతుందని సూచించింది. వైరస్ కంటికి కూడా సోకుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే చేతులను శుభ్రంగా కడుక్కోకుండా ముఖాన్ని, కళ్లను తాకరాదని వైద్యులు సూచిస్తున్నారు.