స్లోగన్ స్టోరీ : సైకిల్ తొక్కండి.. లక్షలు ఆదా చేయండి

సైకిల్.. ఎలక్షన్స్ లో సింబల్ కాదండీ.. రియల్ సైకిల్. బండ్లు వచ్చిన తర్వాత బద్దకం అయిపోయాం. పొట్టలు పెంచేశాం.. రోగాలు కొని తెచ్చుకున్నాం.. రియలైజ్ అయిన తర్వాత రోడ్లపై సైకిల్ తొక్కే పరిస్థితులు లేవు. ఏం చేస్తాం..

  • Published By: sreehari ,Published On : January 19, 2019 / 11:17 AM IST
స్లోగన్ స్టోరీ : సైకిల్ తొక్కండి.. లక్షలు ఆదా చేయండి

సైకిల్.. ఎలక్షన్స్ లో సింబల్ కాదండీ.. రియల్ సైకిల్. బండ్లు వచ్చిన తర్వాత బద్దకం అయిపోయాం. పొట్టలు పెంచేశాం.. రోగాలు కొని తెచ్చుకున్నాం.. రియలైజ్ అయిన తర్వాత రోడ్లపై సైకిల్ తొక్కే పరిస్థితులు లేవు. ఏం చేస్తాం..

సైకిల్.. ఎలక్షన్స్ లో సింబల్ కాదండీ.. రియల్ సైకిల్. బండ్లు వచ్చిన తర్వాత బద్దకం అయిపోయాం. పొట్టలు పెంచేశాం.. రోగాలు కొని తెచ్చుకున్నాం.. రియలైజ్ అయిన తర్వాత రోడ్లపై సైకిల్ తొక్కే పరిస్థితులు లేవు. ఏం చేస్తాం.. భారీ ధరలు పెట్టి ఎక్సర్ సైజ్ సైకిల్ కొంటున్నాం. అదే సైకిల్ రోడ్డుపై తొక్కితే ఆరోగ్యంతో పాటు లక్షల డబ్బు ఆదా అంటున్నారు. ఈ విషయాన్ని మీరు చెప్పేది ఏంటీ.. మాకు తెలియదా అనుకుంటున్నారా? మామూలుగా చెబితే మీ ఫీలింగ్ ఇదే.. అదే లెక్కలు, సర్వేలతో చెబితే వినరా ఏంటీ.. ఇంతకీ సైకిల్ తొక్కండి.. లక్షలు ఆదా చేయండి. స్లోగన్ వెనక స్టోరీ ఏంటో చదివేద్దాం.

రోజూ సైకిల్ తొక్కితే.. ఏడాదికి రూ. 1.8 లక్షల కోట్లు ఆదా
బైకులు, కార్లకు రివల్యూషన్ గా 2019లో మళ్లీ రోడ్లపైకి సైకిళ్లు తిరిగే రోజులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఇంటి దగ్గరే మీ వాహనాలను వదిలేయండి. సైకిల్ ఎక్కండి.. చక్కగా కాలేజీలు, ఆఫీసులకు వెళ్లండి. మంచి ఆరోగ్యం.. డబ్బులు కూడా ఆదా అవుతాయి. భారతీయులంతా ప్రతిరోజు వాహనాలకు బదులుగా సైకిల్ మాత్రమే తొక్కాలని గట్టిగా నిర్ణయించుకుంటే ఏడాదికి భారత్ లో 255 బిలియన్ డాలర్లు (రూ.1.8 లక్షల కోట్లు) ఆదా చేయొచ్చు, లేదా స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 1.6 శాతం రేటు నమోదు అవుతుందని ఓ నివేదిక పేర్కొంది. థింక్-ట్యాంకు అనే ది ఎనర్జీ అండ్ రిసెర్చ్ ఇన్స్ స్టిట్యూట్ (టీఈఆర్ఐ)లో ఈ నివేదికను ప్రచురించారు. భారతీయులంతా బైక్ లు, కార్లు వదిలేసి సైకిళ్లకు మారితే 8 కిలోమీటర్ల మేర ప్రయాణం సగానికి సగం తగ్గిపోతుందని నివేదిక తెలిపింది. గ్రామాల్లో సైకిళ్లు, సిటీల్లో బైక్ లు వాడుతున్నప్పటికీ.. చక్కగా షార్ట్ కట్ మార్గంలో కాలినడకే ఎంతో భేష్ అంటున్నారు.

మళ్లీ సైకిల్ తొక్కేలా ప్రోత్సాహం అవసరం
దశాబ్ద కాలంలో కార్లు, ద్విచక్రవాహనాలపై వెళ్లేవారి సంఖ్య 10 శాతానికి పెరిగిపోయింది. ఇదే సమయంలో సైకిల్ వాడకం కూడా స్తంభించిపోయింది. సాధ్యమైనంతవరకు ఇందనంతో నడిచే వాహనాలకు బదులుగా సైకిళ్లను వాడితే ఆర్యోగపరంగా కూడా మంచి ప్రయోజనం ఉంటుందని నివేదిక తెలిపింది. తక్కువ దూరం వెళ్లాల్సిన సమయాల్లో వాహనాలకు బదులు సైకిళ్లను వాడితే 15 ఏళ్లలో 4,756 అకాల మరణాల నుంచి కాపాడుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులను సైకిల్ తొక్కేలా ప్రోత్సాహించడం సవాల్ తో కూడుకున్న పని. 1954లో 57 శాతానికి పైగా భారతీయులు సైకిళ్లే ఎక్కువగా వాడేవారని టెరాయ్ 2014 డేటా పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో ఈ రోజుల్లో 6 శాతం నుంచి 8 శాతం కంటే తక్కువగా సైకిళ్లను తొక్కుతున్నట్టు తెలిపింది. ఈకో ఫ్రెండ్లీయిస్ట్ మోడ్ ప్రయాణానికి అనువైనప్పటికీ రోడ్లపై సైకిళ్లు కనుమరుగయ్యాయి. సైకిళ్ల కోసం ప్రత్యేకంగా రోడ్లకు ఇరువైపులా ట్రాక్స్ ఏర్పాటు చేస్తే కొంతమేరకైనా సైకిళ్లు మళ్లీ వినియోగంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని టెరాయ్ అభిప్రాయపడింది.