కోవిడ్ – 19 (కరోనా) వైరస్..అప్ డేట్

  • Published By: madhu ,Published On : March 1, 2020 / 01:35 PM IST
కోవిడ్ – 19 (కరోనా) వైరస్..అప్ డేట్

Updated On : March 1, 2020 / 1:35 PM IST

కోవిడ్ – 19 (కరోనా) వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ఇంకా విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దేశ దేశాలకు పాకుతోంది. ఎంతో మంది ప్రాణాలను కబలిస్తోంది. చైనాలో మొత్తంగా 2 వేల 870 మంది చనిపోయారు. 35 వేల 329 మంది వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్నారు. 41 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. 51 వేల 856 మంది ఇంకా మెడికల్ అబ్జర్ వేషన్‌లో ఉన్నారని నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది.

తాజాగా WHO, నేషనల్ హెల్త్ కమిషన్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేసింది. zoonotic virusగా గుర్తించినట్లు, పరాన్నజీవుల నుంచి వచ్చే అంటువ్యాధి..జంతువుల నుంచి మానవులకు వ్యాపించిందిని తెలిపింది. వైరస్‌లను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని WHO డైరెక్టర్ జనరల్ అధనామ్ హెచ్చరించారు. భయపడే సమయం కాదని..వైరస్‌ను అరికట్టడానికి, ప్రాణాలను కాపాడటానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. చైనాలో మరణమృందంగం మ్రోగిస్తోంది.

తాజాగా 2020, మార్చి 01వ తేదీ ఆదివారం ఒక్కరోజే 35 మరణాలు సంభవించడం వైరస్ ఎంత తీవ్రంగా ఉందో అర్థమౌతుంది. గత మూడు రోజుల్లో 573 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 87 వేల మంది వైరస్ బారిన పడ్డారని అంచనా. సౌత్ కొరియాలో 376 కేసులు రికార్డయ్యాయి. అమెరికాలో ఈ వైరస్ బారిన పడి మరణించినట్లు ఆదేశం వెల్లడించడంతో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్యను వెల్లడించింది.

ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలకు విస్తరించిందని అంచనా. దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌లలో కూడా వైరస్ విజృంభిస్తోంది. దక్షిణ కొరియాలో ఆదివారం 586 కొత్తగా కేసులు నమోదయ్యాయి. మొత్తం ఈ సంఖ్య 3 వేల 736కి చేరింది. ఈ వైరస్ సవాల్ లాంటిదని బ్రిటన్ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. వైరస్ వ్యాపిస్తుండడంతో బ్రిటన్ ప్రధాన మంత్రి సోమవారం అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు.

కరోనా వైరస్‌ను అరికట్టడానికి తమ వద్ద స్పష్టమైన వ్యూహం ఉందని, కానీ సవాల్ లాంటిదన్నారు ప్రధాని. వైరస్ వ్యాపిస్తుంటే…రిటైర్ అయిన హెల్త్ వర్కర్లను తిరిగి జాయిన్ అయ్యే విధంగా ప్రభుత్వం పరిశీలిస్తుందని వెల్లడించారు. కొన్ని గమ్యస్థానాలకు ప్రయాణించవద్దని ప్రభుత్వ సంస్థలు సూచిస్తున్నాయి. ఇలాంటి హెచ్చరికలు తీవ్రంగా పరగణించాల్సిన విషయమని డాక్టర్ రిచర్డ్  దావూద్ (ట్రావెల్ మెడిసన్ నిపుణుడు, ఫ్లీట్ స్ట్రీట్ క్లినిక్ మెడికల్ డైరెక్టర్) తెలిపారు. 

పరిశుభ్రత పాటించాలని, కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. అనారోగ్యంతో ఉంటే..వారి నుంచి ఆరుడగుల దూరం ఉంచాలని డాక్టర్ ఐసెన్మాన్ అన్నారు. దగ్గు, తుమ్మే సమయంలో..జాగ్రత్తలు పాటించాలన్నారు. 

Read More : ప్రభుత్వ స్థలంలో ఇల్లు ఉందా..అయితే మీకు పట్టా – ఎర్రబెల్లి