Lars Wilkes : మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర కార్టూన్ వేసిన వ్యక్తి దుర్మరణం
మహ్మద్ ప్రవక్త అభ్యంతరకర కార్టూన్ వేసి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన స్వీడిష్ ఆర్టిస్ట్ లార్స్ మిల్క్స్ దుర్మరణం చెందారు.

Lars Wilkes
Lars Wilkes : మహ్మద్ ప్రవక్త అభ్యంతరకర కార్టూన్ వేసి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన స్వీడిష్ ఆర్టిస్ట్ లార్స్ మిల్క్స్ దుర్మరణం చెందారు. కారు అదుపుతప్పి ఫల్టీలు కొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. కాగా ఇతని వయసు 75 ఏళ్లు.. 2007లో ఆయన గీసిన మహ్మద్ ప్రవక్త చిత్రపటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
Read More : Lion In Toilet : జెంట్స్ టాయిలెట్ లోంచి బయటకొస్తున్న ఆడ సింహం..ఇదేం సిగ్గురా బాబూ అంటున్న జనాలు..
అతడికి ప్రాణహాని ఉండటంతో ఇంతకాలం పోలీసులు రక్షణ కల్పించారు. తాజాగా పోలీసు వాహనంలోనే ప్రయాణిస్తున్న సమయంలో వారి కారు ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లార్స్ విల్క్స్ తో పాటు ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
Read More : Telangana : మంత్రి కేటీఆర్ కారుకు చలాన్, ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్‌కు సన్మానం