అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. అంతరిక్షం నుంచి ఓటేసిన వ్యోమగామి ‘కేట్ రూబిన్స్’

US presidential election..NASA astronaut votes from iss : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎంత హీట్ మీద ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటు ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్..మరోపక్క బైడెన్ లు హోరా హోరీ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. వచ్చే నవంబర్ 3న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అమెరికాకు చెందిన వ్యోమగామి అంతరిక్షంలో నుంచి ఓటు వేశారు.
భూమికి దాదాపు 408 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పటికీ అమెరికాకు చెందిన ఓ వ్యోమగామి కేట్ రూబిన్స్ అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంటర్నెషనల్ స్పేస్ సెంటర్ నుంచి కేట్ రూబిన్స్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేట్ రూబిన్సే.. నాసాకు చెందిన యూఎస్ స్పేస్ ఏజెన్సీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ‘ఇంటర్నేషనల్ స్పెస్ స్టేషన్ నుంచి నేను ఈ రోజు ఓటు వేశాను’ అని పేర్కొన్నారు.
https://10tv.in/biden-vs-trump-us-presidential-election-2020/
అది అంతరిక్ష నాసా కేంద్రం.. అక్కడే ‘ఐఎస్ఎస్ ఓటింగ్ బూత్’ అని రాసి ఉన్న ప్యాడెడ్ బూత్ ఉంది. అక్కడ కేట్ రూబిన్స్ అనే ఉమెన్ ఆస్ట్రోనాట్ చిరునవ్వులు చిందిస్తూ.. తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా నిలుచున్నారు. బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకుని.. నేను ఓటేశానోచ్ అని అంతరిక్షం నుంచి చెప్పారు.
కాగా..కేట్ రూబిన్స్ ఐఎస్‌ఎస్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారేమీ కాదు. 2016లోనూ ఆమె అంతరిక్షం నుంచే ఓటు వేశారామె. ‘అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన బాధ్యత. అక్టోబర్ 14 నుంచి మొదలైన ఐఎస్ఎస్ మిషన్‌లో ఉన్నాను. ఓటింగ్ జరిగే రోజున తాను స్పేస్ మిషన్‌లో ఉంటాను’ అని రూబిన్స్ తెలిపింది. రూబిన్స్ ఓటు వేసిన ఫోటోను నాసా ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.
అంతరిక్షం నుంచి ఓటు వేసే సదుపాయాన్ని నాసా 1997 నుంచి కల్పిస్తోంది. అప్పటి నుంచి చాలా మంది వ్యోమగాములు ఫెడరల్ పోస్ట్ కార్డు అప్లికేషన్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మొదటిసారి డేవిడ్ వోల్ఫ్ అనే వ్యోమగామి అంతరిక్షం నుంచి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2024లో చంద్రుడి మీదకు ఆస్ట్రోనాట్స్‌ను పంపించాలనుకుంటున్నాం. మార్స్‌పైనా ఆస్ట్రోనాట్స్ సోలార్ సిస్టమ్‌లో ఎక్కడ ఉన్నా.. ఓటు హక్కును మాత్రం వినియోగించుకుంటారు’ అని నాసా తెలిపింది.
From the International Space Station: I voted today
— Kate Rubins pic.twitter.com/DRdjwSzXwy
— NASA Astronauts (@NASA_Astronauts) October 22, 2020