Russia Ukraine War: ఐఎస్ఎస్ ను కూల్చివేస్తాం: సంచలన ప్రకటన చేసిన రష్యా

రష్యాపై విధిస్తున్న ఆంక్షల విషయంలో వెనక్కు తగ్గని పక్షంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని భూమిపై కూల్చివేస్తామంటూ రష్యా హెచ్చరించింది

Russia Ukraine War: ఐఎస్ఎస్ ను కూల్చివేస్తాం: సంచలన ప్రకటన చేసిన రష్యా

Putin

Updated On : March 12, 2022 / 3:06 PM IST

Russia Ukraine War: యుక్రెయిన్ పై రష్యా యుద్ధం మూడో వారానికి చేరుకుంది. ప్రపంచ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా.. వెనక్కు తగ్గని రష్యా.. యుక్రెయిన్ ను తమదారిలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా యుద్ధం కొనసాగిస్తుంది. రష్యా దూకుడుకు కళ్లెం వేసేలా అమెరికా ఐరోపా దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. రష్యాతో ఆర్ధిక దౌత్య సంబంధాలను తెగతెంపులు చేస్తూ ఆంక్షలు విధించాయి పశ్చిమదేశాలు. అయితే తమపై ఆంక్షలు విధించిన దేశాలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యాపై విధిస్తున్న ఆంక్షల విషయంలో వెనక్కు తగ్గని పక్షంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని భూమిపై కూల్చివేస్తామంటూ రష్యా హెచ్చరించింది. యుక్రెయిన్ పై యుద్ధం ఆరంభమైన తోలి రోజు నుంచే రష్యాపై ఆంక్షలు మొదలవగా.. తమపై ఆంక్షలు తొలగించకుంటే స్పేస్ స్టేషన్ (ISS)ను భారత్, చైనా, ఐరోపా దేశాల్లో కూల్చివేస్తామంటూ రష్యా హెచ్చరించింది. అయితే ప్రస్తుతం అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఆంక్షలు మరింత కఠినతరం అయిన నేపథ్యంలో రష్యా మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also read: Russian Mercenary Army : యుక్రెయిన్‌లో రష్యా కిరాయి సైన్యం.. రంగంలోకి 16 వేల మంది వాలంటీర్లు

మరోవైపు యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యా సైన్యం తడబాటుకు గురవడంపై.. దేశాధ్యక్షుడు పుతిన్ అసహనం వ్యక్తం చేశారు. రోజుల వ్యవధిలో యుక్రెయిన్ ను చుట్టేయాలని సంకల్పించిన పుతిన్ కు.. యుక్రెయిన్ సైన్యం నుంచి ఊహించని విధంగా ప్రతిఘటన ఎదురైంది. యుక్రెయిన్ లోకి అడుగుపెట్టిన రష్యా బలగాలను యుక్రెయిన్ సైన్యం తుదముట్టించింది. వందల సంఖ్యలో రష్యా సైనికులు మృత్యువాత పడ్డారంటూ అంతర్జాతీయంగా కథనాలు వెలువడ్డాయి. ఈ భంగపాటుతో సహనం కోల్పోయిన పుతిన్ తన సైన్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడని..యుద్ధ రంగంలో ఉన్న 8 మంది జనరల్ స్థాయి అధికారులను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించుకున్నట్లు యుక్రెయిన్ నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

Also read: China New Virus : చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. చైనీయుల్లో భయాందోళన