Meenakshi Chaudhary : హమ్మయ్య.. గుంటూరు కారంలో మీనాక్షి ఉంది.. మహేష్‌తో మీనాక్షి ఫస్ట్ పోస్టర్ చూశారా?

సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న 'గుంటూరు కారం' సినిమా నుండి కొత్త పోస్టర్ విడుదల చేసారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది.

Meenakshi Chaudhary : హమ్మయ్య.. గుంటూరు కారంలో మీనాక్షి ఉంది.. మహేష్‌తో మీనాక్షి ఫస్ట్ పోస్టర్ చూశారా?

Meenakshi Chaudhary

Updated On : January 4, 2024 / 1:36 PM IST

Meenakshi Chaudhary : మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ రిలీజ్‌కి దగ్గర పడుతోంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. లంగావోణీలో మహేష్ బాబు భుజాలపై చేతులు వేసి నిల్చున్న మీనాక్షి లుక్ అదిరిపోయింది.

Guntur Kaaram : గుంటూరు కారం సూపర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రైలర్ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉంది మూవీ టీమ్. వరసగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. జనవరి 6 న ట్రైలర్, ప్రీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసారు. ఈ ఈవెంట్‌ని అమెరికా థియేటర్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇవ్వబోతున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రని పరిచయం చేస్తూ మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. లంగా వోణీలో క్యూట్‌‌గా ఉన్న మీనాక్షి మహేష్ బాబు భుజాలపై చేతులు వేసుకుని నిలబడి ఉంది. ఈ సినిమాలో ‘రాజీ’ పాత్రలో మీనాక్షిని పరిచయం చేస్తూ మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది.

Mahesh Babu : 100లో 90 థియేటర్లు మహేష్ బాబుకే.. సంక్రాంతికి గుంటూరు కారం ఘాటు.. ఓపెనింగ్స్ ఎంత?

కాగా ఈ సినిమాలో మహేష్ బాబు-మీనాక్షి చౌదరి మధ్య వచ్చే సీన్స్ హైలైట్ కాబోతున్నాయట. రొమాంటిక్‌గా, టీజింగ్ ఉంటాయని తెలుస్తోంది. గుంటూరు కారంలో మరో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం కీలక పాత్రలు చేస్తున్నారు. హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.