Sarkaru Vaari Paata-Salaar: హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్.. టాక్ అఫ్ ది ఇండస్ట్రీ!

రెండు సినిమాల యాక్షన్ సీక్వెన్స్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. అవును గ్లోబల్ స్టార్ సలార్ మూవీతో పాటూ సూపర్ స్టార్ సర్కారు వారి పాటకి సంబంధించిన..

Sarkaru Vaari Paata-Salaar: హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్.. టాక్ అఫ్ ది ఇండస్ట్రీ!

Sarkaru Vaari Paata Salaar

Updated On : January 20, 2022 / 9:27 PM IST

Sarkaru Vaari Paata-Salaar: రెండు సినిమాల యాక్షన్ సీక్వెన్స్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. అవును గ్లోబల్ స్టార్ సలార్ మూవీతో పాటూ సూపర్ స్టార్ సర్కారు వారి పాటకి సంబంధించిన రీసెంట్ ముచ్చట.. ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తోంది.

New Villains: హైలెట్‌గా విలనిజం.. అందుకోసమే స్టైలిష్ స్టార్స్!

సర్కారు వారి పాట కోసం స్ట్రాంగ్ కంటెంట్ తో పాటూ యాక్షన్ సీక్వెన్స్ లను నెక్ట్స్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ పరశురామ్. ఇప్పటికే ఈ సినిమాలోని దుబాయ్ యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ రేంజ్ ని తలపిస్తుందనే టాక్ ఉంది. ఇపుడు ఇంకో అదిరే సీక్వెన్స్ కూడా సర్కారు పై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. రీసెంట్ గా ఈ యాక్షన్ సీక్వెన్స్ ఫోటోస్ కొన్ని బయటికొచ్చి వైరల్ అవుతున్నాయి. బీచ్ దగ్గర విలన్స్ తో వేరే లెవెల్ మాస్ ఫైట్ తో సూపర్ స్టార్ అదరగొట్టడం ఖాయమంటున్నారు.

Deepthi Sunaina: లంగా ఓణీలో దీప్తి సునయన క్యూట్ లుక్స్!

అంతకుమించి అన్న లెవెల్ లో సలార్‌ కోసం యాక్షన్‌ సీన్స్‌ ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్‌ నీల్. ఈ సినిమాలోని హైఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం దాదాపు 20 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ సీక్వెన్స్‌ సలార్ సినిమాకే హైలెట్‌ కానుందని చెప్తున్నారు. బొగ్గు గనుల మాఫియా బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ రేంజ్ లో గ్లోబల్ స్టార్ ను చూడబోతున్నారు ఫ్యాన్స్. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ గా మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కనిపించబోతున్నాడని అనధికారికంగా తెలుస్తున్న విషయం.