అందరూ రాజమౌళి సినిమాల కోసం వెయిటింగ్.. ఆయన వెయిట్ చేసేది ఎవరి సినిమాల కోసమో తెలిస్తే..

తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అందరూ రాజమౌళి సినిమాల కోసం వెయిటింగ్.. ఆయన వెయిట్ చేసేది ఎవరి సినిమాల కోసమో తెలిస్తే..

Updated On : April 13, 2025 / 6:24 PM IST

దర్శకుడు రాజమౌళి తీస్తున్న సినిమాల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అటువంటిది, రాజమౌళి మాత్రం కొందరు తీస్తున్న పాన్ ఇండియా సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు.

తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఓ ప్రేక్షకుడిగా ప్రశాంత్‌నీల్‌-ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. అలాగే, సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్‌ నటిస్తున్న స్పిరిట్‌, బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటిస్తున్న పెద్ది సినిమా కోసం వేచి చూస్తున్నానని అన్నారు.

Also Read: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచులో ఆర్సీబీ ఇలా రెడ్‌ జెర్సీ కాకుండా గ్రీన్‌ జెర్సీ ఎందుకు ధరించింది?

పెద్ది సినిమా గ్లింప్స్‌ తాజాగా రిలీజ్‌ అయిందని చెప్పారు. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా లెవెల్‌లో రూపుదిద్దుకుంటున్నాయి. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో వస్తున్న సినిమాకు డ్రాగన్‌ అనే పేరు ప్రచారంలో ఉంది.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్- ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే ప్రశాంత్ నీల్ మొదలుపెట్టేశారు. పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు సరసన రుక్మిణీ వసంత్‌ నటిస్తోంది.

ఇక ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ సినిమా కోసం సందీప్‌ రెడ్డి వంగా లొకేషన్స్‌ వెతుకుతున్నారు. ఇక రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సినిమా పెద్ది 2025 మార్చి 27న రీలీజ్ కానుంది. డ్రాగన్, స్పిరిట్, పెద్ది సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.