భారత్‌లో రెండో మృతి, కరోనాతో పోరాడి ఓడిన మహిళ

భారత్‌లో రెండో మృతి, కరోనాతో పోరాడి ఓడిన మహిళ

Updated On : March 13, 2020 / 5:48 PM IST

ఢిల్లీలో కరోనా వైరస్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దేశంలో మహమ్మారి కారణంగా రెండో మృతి నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధానిలో కరోనా పాజిటివ్‌గా నమోదైన వారిలో మహిళ ఆరోవది. హైబీపీ, డయాబిటిస్ ఉన్న ఆమె కరోనాను జయించలేకపోయింది. పశ్చిమబెంగాల్‌లో ఉండే ఆమెకు కొడుకు ద్వారా వైరస్ సోకింది. (కరోనా కంట్రోల్ కోసం…మహారాష్ట్రలోని 5సిటీల్లో అన్నీ బంద్)

గత నెలలో స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చిన అతనికి ఉన్న కరోనా తల్లికి వ్యాపించింది. కొడుకు కంటే ముందుగా తల్లిలోనే లక్షణాలు కనిపించడంతో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ లో మార్చి 7న చేర్పించారు. దగ్గు, జ్వరంతో జాయిన్ అయిన ఆమెకు కరోనా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. 

అప్పటి నుంచి ఫ్యామిలీ మొత్తానికి ఐసోలేషన్ లో చికిత్స అందిస్తూ అబ్జర్వేషన్ లో ఉంచారు. మార్చి 9కే మహిళ ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారిపోయింది. న్యూమోనియా పెరిగిపోవడంతో ఐసీయూకి షిప్ట్ చేశారు. అదే రోజు ఆమెకు కరోనా ఉందని గుర్తించారు. 

4రోజుల పాటు పోరాడి మార్చి 13న మృతి చెందింది. దీంతో భారత్‌లో కరోనా కేసులు 85కు చేరాయి. గురువారం కర్ణాటకలో 76ఏళ్ల వృద్ధుడు చనిపోయిన తర్వాతి రోజే మహిళ చనిపోయింది. కేరళలో కరోనా సోకిన వ్యక్తులు ముగ్గురు డిశ్చార్జి కాగా, మరో ఏడుగురి పరిస్థితి చక్కబడిందని వారిని కూడా ఇంటికి  త్వరలోనే పంపేస్తామని వైద్యులు చెబుతున్నారు. 

See Also | సీఎం జగన్ వైజాగ్ వెళ్లడానికి ముహూర్తం సెట్ అయినట్లేనా!