భారత్‌కు వచ్చిన రష్యా అమ్మాయి.. ఐదేళ్ల నుంచి సొంత దేశానికి వెళ్లకుండా.. అయ్య బాబోయ్.. ఇలా ఉందేంటి ఈమె?
రష్యా అమ్మాయి తన ఇంటిని పేరును కూడా మార్చుకుని ఇక్కడే ఉంటూ వీడియో తీసుకుని పోస్ట్ చేసింది.

Russian Girl: ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మహిళ తన గురించి ఓ విషయాన్ని చెప్పి నెటిజన్ల దృష్టిని తన వైపునకు తిప్పుకునేలా చేసుకుంది. రష్యాకు చెందిన తాను భారత్‌కు ఐదు రోజుల పర్యటన కోసం వచ్చానని, అయితే, ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉండిపోయానని తెలిపింది. ఆమె ఇండియాలో ఎంజాయ్ చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది.
ప్రతి ఏడాది లక్షల మంది విదేశీయులు తమ కుటుంబాలతో కలిసి భారతదేశాన్ని సందర్శించడానికి వస్తుంటారు. కొందరు భారతీయులతో సామాజిక మాధ్యమాల వేదికగా స్నేహం కూడా చేస్తుంటారు.
కొందరు విదేశీ అమ్మాయిలు ఇక్కడికి వచ్చి ఇక్కడి అబ్బాయిలను ఇష్టపడి పెళ్లి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటువంటి స్టోరీనే రష్యన్ యువతి పోలినాది. ఆమెకు టూర్లకు వెళ్లడం అంటే ఇష్టం. ఆమె ఒంటరిగా టూర్లకు వెళ్తుంది. ఇందులో భాగంగా పోలినా ఒకసారి ఒంటరిగా భారతదేశానికి వచ్చింది.
ఇక్కడ 5 రోజుల పాటు పర్యాటక ప్రదేశాలు చూసి వెళ్లిపోవాలని భావించింది. టూర్‌కి వచ్చి 5 రోజుల్లోనే భారత్‌కు చెందిన ఓ అబ్బాయిని పోలినా ఇష్టపడింది. వారిద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వారి ప్రేమ పెరిగి, పెళ్లి వరకు వెళ్లింది. ఆ అబ్బాయి భారత్‌లో ఓ వ్యాపారి అని పోలినా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెలిపింది.
అతడిని పెళ్లి చేసుకున్నాక పోలినా తన ఇంటిపేరును అగర్వాల్‌గా మార్చుకుంది. ఆమె స్వదేశానికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నానని తెలిపిన తీరు విస్మయపరుస్తోంది. తన గురించి తాను చెబుతూ పోలినా పోస్ట్ చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది. ఆమె గురించి నెటిజన్లు అనేక రకాల ప్రశ్నలు అడుగుతూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram