UP Man- stork Friendship : ప్రాణం కాపాడిన యువకుడితో కలిసి జీవిస్తున్న కొంగ

ప్రాణం కాపాడిన యువకుడితో కలిసి జీవిస్తుంది ఓ కొంగ. మనిషి అంత పొడవున్న ఆ భారీ కొంగ ఓ యువకుడిని వెన్నంటే తిరుగుతోంది. అతను ఎక్కడికెళితే అక్కడకు వెళుతోంది. అను బైక్ పై వెళుతుంటే ఆ కొంగ గాల్లో ఎగురుతూ అతని వెంటే వెళుతోంది. ఈ మనిషి కొంగ స్నేహం గురించి వింటే మనుషుల కంటే పశు పక్ష్యాదులే నయం అనిపిస్తోంది.

UP Man- stork Friendship : ప్రాణం కాపాడిన యువకుడితో కలిసి జీవిస్తున్న కొంగ

Updated On : March 1, 2023 / 1:56 PM IST

UP Man- stork Friendship : ఆపదలో ఆదుకున్నవారు దేవుడితో సమానం అంటారు. ఇది మనుషులు మర్చిపోయినా మూగజీవులు మాత్రం తమను రక్షించినవారిపై విశ్వాసాన్ని, ప్రేమను చూపటం ఎన్నో సందర్భాల్లో విన్నాం. అటువంటిదే ఈ కొంగ కథ. కొంగ అంటే చేపల కథే గుర్తుకొస్తుంది. కొంగజపం చేస్తూ చేపల్లి చాకచక్యంగా గుటుక్కుమనే కొంగ కథ గురించి తెలుసు.. కానీ ఈ కొంగమాత్రం అటువంటి కొంగజపం చేసే కొంగకాదు. తనను కాపాడిన వ్యక్తిపై ప్రేమనను పెంచుకుని అతను ఎక్కడికి వెళితే అక్కడకు వెళుతోంది ఓ కొంగ. మనిషి అంత పొడవున్న ఈ భారీ కొంగ ఓ యువకుడిని వెన్నంటే తిరుగుతోంది. అతను ఎక్కడికెళితే అక్కడకు వెళుతోంది. అను బైక్ పై వెళుతుంటే ఈ కొంగ గాల్లో ఎగురుతూ అతని వెంటే వెళుతోంది. ఈ మనిషి కొంగ స్నేహం గురించి వింటే మనుషుల కంటే పశు పక్ష్యాదులే నయం అనిపిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌(uttar pradesh)అమేథీ జిల్లాలోని మండ్కా గ్రామంలో మహమ్మద్‌ అరిఫ్ అనే యువకుడు ఉంటున్నాడు. ఆరిఫ్‌ వ్యవసాయం చేస్తుంటాడు. రోజు వెళుతున్నట్లుగానే అరిఫ్ గత ఏడాది పొలం పనుల కోసం వెళ్లిన అరిఫ్ కు గాయపడిన ఓ కొంగ కనిపించింది. కుడికాలికి గాయమై పడి అరుస్తున్న కొంగను చూసిన అరిఫ్ చలించిపోయాడు. ఆరిఫ్‌ దాన్ని దగ్గరకు తీసుకున్నాడు. దాదాపు నాలుగడుగులు పొడుగున్న ఆ కొంగను చూసిన అరిఫ్ దాన్ని గాయాన్ని పరిశీలించాడు..ఒక్కడే దాన్ని తీసుకెళ్లటం సాధ్యంకాలేదు. దీంతో తనతోపాటు పొలంలో పనిచేసేవారిని పిలిచి వారి సహాయంతో ఇంటికి తీసుకెళ్లాడు.

తనకు తోచిన వైద్యం చేసాడు. మందు రాసి కట్టుకట్టాడు. వైద్యం చేసిన దాన్ని అలా వదిలేయకుండా దాదాపు నెల రోజులపాటు దాన్ని తన ఇంట్లోనే ఉంచి చికిత్స చేశాడు. ఆహారం పెట్టాడు. అతని సపర్యలతో కొంగ కోలుకుంది. అలా నెల రోజుల పాటు దాని ఆలనా పాలనా చూసిన అరిఫ్ కు అతని కుటుంబ సభ్యులకు అది బాగా అలవాటు అయింది. అరిఫ్ భార్య ఆహారం పెట్టడం, పిల్లలు ఆడుకోవడం చేసేవారు. కుంటుకుంటు అది నడుస్తుంటే పిల్లలు దాన్ని పట్టుకుని సహాయం చేసేవారు.
Penguin with woman : బుజ్జి పెంగ్విన్‌తో బామ్మ ముచ్చట్లు .. క్యూట్ వీడియోకు ఫిదా అవ్వాల్సిందే..

వారి ఆలనాపాలనతో కొంగ పూర్తిగా కోలుకుంది. అది పూర్తిగా కోలుకోవడంతో విడిచి పెట్టడానికి ఊరి బయటకు తీసుకెళ్లారు. అలా ఆ కొంగ గాల్లోకి ఎగిరిపోయింది. ఎగిరి చాలా రోజులు అయ్యిందేమో ఆకాశంలో తనివితీరా రెక్కలార్చుకుని ఎగిరింది. కానీ అలా ఎగిరిపోయిన ఆ కొంగ తిరిగి అరిఫ్ ఇంటికి వచ్చేసింది. దీంతో అరిఫ్ తో పాటు అతని కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. ఆతరువాత ఆనందపడిపోయారు.

అలా అప్పటనుంచి ఆ కొంగ అరిఫ్ కుటుంబంలో ఓ మనిషిగా కలిసిపోయింది. అలా వారు ఆ కొంగకు ఆహారం పెడుతూ ఓ కుటుంబ సభ్యురాలిలా చూస్తున్నారు. కొంగ వారితోనే ఉండిపోయింది. ఎక్కడికీ వెళ్లడం లేదు. అంతేకాదు తన ప్రాణాలు కాపాడిన అరిఫ్ పై ప్రేమ పెంచుకుంది. అరిఫ్ ఎక్కడికెళితే అది అక్కడకు కూడా వెళ్లేంది. అతను ఏమన్నా పనులు చేసుకుంటుంటే పక్కనే పడుకునేది. అలా కొంగ అరిఫ్ పై చూపించే ప్రేమకు అరిఫ్ చలించిపోయేవాడు. చిన్నసహాయం చేసినందుకు ఇంతలా ప్రేమ చూపిస్తుందే అని మురిసిపోయేవాడు. దాన్ని దగ్గరకు తీసుకుని నిమిరేవాడు. అతని ప్రేమను అర్థం చేసుకున్న ఆ మూగజీవి అరిఫ్ కు మరింతగా అతుక్కుపోయి తన ప్రేమను చూపించేది. అరిఫ్ బైక్ మీద ఎక్కడికైనా వెళితే గాల్లో ఎగురుకుంటూ వెళుతుంది ఆ కొంగ. అలా వారిద్దరి మధ్యా స్నేహం చూసినవారంతా కూడా భలే స్నేహం..మనిషికి కొంగకు మధ్య అనుకోవటం పరిపాటిగా మారిపోయింది. అలా అరిఫ్ తో ఏడాది నుంచి కలిసి ఉంటోందా కొంగ.

కొంగ చూపించే ప్రేమ గురించి అరిఫ్ మాట్లాడుతూ ఏదో గాయపడింది.సహాయం చేస్తే తిరిగి ఎగిరిపోతుంది అనుకున్నాను కానీ నాపై ఇంత ప్రేమ చూపిస్తుందనుకోలేదంటూ కొంగను ప్రేమగా ఆప్యాయంగా నిమురుతూ చెబుతున్నాడు. మా ఇంట్లో మనిషిలా మెలుగుతోంది..నేను తిన్నా కంచంలోనే అదికూడా తింటోంది అని చెప్పుకొచ్చాడు. కొంగను నేను ఎప్పుడు బంధించలేదు..అందుకే అటవీ, వన్యప్రాణుల సంరక్షణ అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బంలురాలేదన్నాడు అరిఫ్.నేను బైక్‌పై వెళితే నాకూడా గాల్లో ఎగురుతు వస్తుందని మురిపెంగా చెప్పాడు అరిఫ్. ఎదురుగా వాహనాలు వస్తే అప్పటికప్పుడు పైకి ఎగిరిపోయి.. తరువాత కిందకు దిగుతూ నాతో పాటు వస్తోందని తెలిపాడు అరిఫ్. నా బుజ్జి కొంగ సేఫ్టీ కోసం నేను సాధ్యమైనంత వరకు ట్రాఫిక్‌ ఉండే రోడ్లపైకి వెళ్లడం లేదని..ఇలా నా బుజ్జి కొంగతో మా స్నేహం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు అరిఫ్.