Judges Appoint : ఒకే రోజు 17 మంది జడ్జిల నియామకం

దేశంలో రికార్డుస్థాయిలో మంగళవారం మూడు హైకోర్టులకు కొత్తగా 17 మంది న్యాయమూర్తులు నియామకం అయ్యారు. వీరిలో 15 మంది న్యాయవాదులు, ఇద్దరు జ్యుడీషియల్‌ అధికారులు ఉన్నారు.

Judges Appoint : ఒకే రోజు 17 మంది జడ్జిల నియామకం

Supreme Court

Updated On : October 13, 2021 / 9:42 AM IST

new judges appointed high courts : దేశంలో రికార్డుస్థాయిలో మంగళవారం మూడు హైకోర్టులకు కొత్తగా 17 మంది న్యాయమూర్తులు నియామకం అయ్యారు. వీరిలో ఎనిమిది మంది అలహాబాద్‌ హైకోర్టుకు, ఐదు మంది గువాహటి హైకోర్టుకు, నలుగురు మద్రాస్‌ హైకోర్టుకు నియామకం అయ్యారు. 17 మంది న్యాయమూర్తుల్లో 15 మంది న్యాయవాదులు, ఇద్దరు జ్యుడీషియల్‌ అధికారులు ఉన్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం వివిధ హైకోర్టుల జడ్జిలుగా నియామకానికి పలువురి పేర్లను గత నెలలో కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అప్పటి నుంచి జడ్జిల నియామకం జరుగడం ఇది మూడో విడత.

Manipur : మణిపూర్ లో ఉగ్రవాదుల కాల్పులు..ఐదుగురు పౌరులు మృతి

ఇటీవల ఒకేరోజు ఇంతమంది జడ్జిలను నియమించడాన్ని చూడలేదని సీనియర్‌ న్యాయవాదులు తెలిపారు. అలాగే గువాహటి హైకోర్టులో ముగ్గురు అదనపు జడ్జిలకు పూర్తిస్థాయి జడ్జిలుగా పదోన్నతి లభించింది.