మోడీ,మంత్రుల వల్లే..భారతీయుల్లో వ్యాక్సిన్ పై నమ్మకం పెరిగింది : సర్వే

కోవిడ్ - 19 వ్యాక్సిన్ తీసుకునేందుకు దేశ ప్రజలు ముందుకొస్తున్నారు. టీకా ఇవ్వడం ప్రారంభమైన సమయంలో తీసుకునేందుకు చాలామంది భయపడ్డారు.

మోడీ,మంత్రుల వల్లే..భారతీయుల్లో వ్యాక్సిన్ పై నమ్మకం పెరిగింది : సర్వే

More Indians Now Willing To Take Vaccine After Cases Spike Modi Ministers Take Shot Survey

Updated On : April 3, 2021 / 12:38 PM IST

Indians కోవిడ్ – 19 వ్యాక్సిన్ తీసుకునేందుకు దేశ ప్రజలు ముందుకొస్తున్నారు. టీకా ఇవ్వడం ప్రారంభమైన సమయంలో తీసుకునేందుకు చాలామంది భయపడ్డారు. కానీ మార్చి చివరి వారం నుంచి టీకా తీసుకునేందుకు ముందుకు వచ్చే వారి సంఖ్య అమాంతం పెరిగింది. మూడు నెలల క్రితం 38 శాతం మంది కరోనా టీకా తీసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇక ఏప్రిల్ నాటికీ ఈ సంఖ్య 77 శాతానికి పెరిగింది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంటడంతో ప్రజల్లో ఆందోళన పెరిగి టీకా తీసుకునేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధాని మోడీ కరోనా టీకా తీసుకున్న తర్వాత టీకా వేయించుకునేందుకు ముందుకు వస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
ALSO READ: కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు..7కోట్లకు పైగా డోసుల పంపిణీ
మరోవైపు కరోనా కేసుల పెరుగుదల దేశంలో అధికంగా ఉంది. ఏప్రిల్ 2న దేశ వ్యాప్తంగా 80,000 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిలో మహారాష్ట్రలోని అత్యధిక కేసులు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్ ప్రారంభమైన మొదట్లో ప్రజలు భయపడేవారు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని పుకార్లు రావడంతో చాలామంది ఈ వ్యాక్సిన్ జోలికి వెళ్ళలేదు. ప్రజాప్రతినిధులు వ్యాక్సిన్ తీసుకోని ప్రజల్లో దైర్యం నింపారు. దీంతో ప్రజలు టీకా బాట పట్టారు.

2021 జనవరి రెండవ వారంలో 38 శాతం మంది టీకా తీసుకునేందుకు సిద్ధంగా ఉండగా, టీకా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న వారి శాతం క్రమంగా పెరిగింది. జనవరి మూడో వారానికి వచ్చే సరికి 40 శాతానికి పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో 45 శాతానికి, రెండవ వారానికి 50 శాతానికి, మూడవ వారానికి 64 శాతానికి పెరిగింది. ఇక ఏప్రిల్ 1 నాటికి 77 శాతం మంది టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది.