PM Modi..Birsa Munda : బిర్సాముండా జన్మస్థలాన్ని సందర్శించిన తొలి ప్రధాని మోదీ .. ఎవరీ బిర్సా ముండా..?

ప్రధాని మోదీ బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతును సందర్శించారు. బిర్సాముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దీంతో మోదీ భారత చరిత్రలో బిర్సాముండా జన్మస్థలాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.

PM Modi..Birsa Munda : బిర్సాముండా జన్మస్థలాన్ని సందర్శించిన తొలి ప్రధాని మోదీ .. ఎవరీ బిర్సా ముండా..?

PM Modi statue of Birsa Munda

PM Modi garlands a statue of Birsa Munda : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనల్లోను..ప్రజల్ని ఆకట్టుకోవటంలోను తనదైన శైలిలో వ్యవహరిస్తుంటారనే విషయం తెలిసిందే. దేశంలో ఏ ప్రాంతాన్ని సందర్శించినా ఆ ప్రాంత ప్రజలతో మమేకమైపోతుంటారు. భారతదేశ చరిత్రలో ఏ ప్రధాని సందర్శించని స్థలాలను సందర్శిస్తు తనదైన ముద్ర వేసుకుంటున్నారు. దీంట్లో భాగంగానే జార్ఖండ్ లో పర్యటలో ప్రధాని మోదీ ఈరోజు బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతును సందర్శించారు. నవంబర్ 15 బిర్సాముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దీంతో మోదీ భారత చరిత్రలో బిర్సాముండా జన్మస్థలాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.

బిర్సాముండా…జార్ఖండ్ ప్రజల ఆరాధ్య దేవుడు. బ్రిటీషువారిని ముప్పు తిప్పలు పెట్టిన ఆదివాసీల దేవుడుగా కీర్తించబడుతున్న గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా. బిర్సా ముండా జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలోని ఉలిహతులో 1875 నవంబర్ 15న జన్మించారు. ఉలిహతులో బిర్సా ముండా విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. ఆ తరువాత ప్రధాని బిర్సా కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారు.

బిర్సా ముండా గిరిజన మత సహస్రాబ్ది ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు. గిరిజనల్లో నెలకొన్ని మూఢనమ్మకాలను తొలగించే ప్రచారాన్ని చేశారు. ఆదివాసీలు చదువుకోవాలనే ప్రచారం చేసారు. అప్పట్లో ఆదివాసీల భూములపై అధిక పన్నులు వేసే బ్రిటీష్ దొరలకు ఎదిరించి పోరాటం చేసిన పోరాట యోధుడు. పన్నులు చెల్లించనవారిని తెల్లదొరలు నానా హింసలు పెట్టేవారు. వారి ఆస్తులు లాక్కునేవారు. దీంతో బిర్సా ముండా వారిపై పోరాటం చేశారు. భూస్వాముల ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తు..వారిని పోరాటం దిశగా నడిపిన గొప్ప మనిషి. తమ భూములు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తి బిర్సాముండా. అలా బిర్సా ముండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని ముండా తిరుగుబాటు లేదా ఉల్గులన్ అని పిలుస్తారు. అంటే తిరుగుబాటు అని అర్థం. ఆదివాసీలను ఐక్యం చేస్తు ఉద్యమాలు చేసేవారు. అలా అతని సారధ్యంలో ఉద్యమంలో పాల్గొన్నారు ఆదివాసీలు అంతా.

PM Modi : బిర్సా ముండా జన్మస్థలాన్ని దర్శించటం నా అదృష్టంగా భావిస్తున్నా : జార్ఖండ్ పర్యటనలో ప్రధాని మోదీ

దీంతో ..పోరాటాలను అణచివేయాలని బ్రిటీష్ దొరలు బిర్సాను 1895లో అరెస్టు చేశారు. జైలు నుండి విడుదలైన తర్వాత బిర్సా ముండా బ్రిటిష్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా గిరిజన సమాజాన్ని ఏకం చేసేలా కృషి చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు బిర్సా ముండా. దీంతో ఆయన్ని అరెస్టులు చేయటం హింసించటం చేసేవారు. అయినా పోరాటాన్ని ఆపలేదు. ప్రజల్ని చైతన్య పరచటం ఉద్యమాలు చేయించటం వంటివి వెనుకుండి నడిపించేవారు బిర్సా. దీంతో అతని ఆచూకీ చెప్పాలని ఆదివాసీలను హింసించేవారు బ్రిటీష్ వారు. అతని అనుచరులను కాల్చి చంపేసేవారు. బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేస్తు ప్రజల్లో చైతన్యాన్ని నింపుతు..వారి హక్కులను తెలియజేస్తు ఎన్నో కార్యక్రమాలు చేసేవారు బిర్సాముండా.

దీంతో బ్రిటీష్ వారు బిర్సా ముండాపై రివార్డు ప్రకటించారు. అతనికి అప్పగిస్తే బహుమానాలు ఇస్తామని ఆదివాసీలకు ఆశపెట్టారు. బిర్సా ఉన్న చోటు తెలుసుకుని కాల్పులు జరిపినా చాకచక్యంగా తప్పించుకుంటు వారికి చుక్కలు చూపించేవారు బిర్సా. అలా జాతీయ ఉద్యమంలో ఎంతో ప్రభావం చూపించటమే కాదు ఆదివాసీల హక్కుల కోసం..వారి భూముల కోసం పోరాడిన గొప్ప నాయకుడు బిర్సాముండా. ఉద్యమాలు చేయించే బిర్సా ఎప్పటికైనా తమకు ప్రమాదమని గ్రహించిన బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ని 1900 మార్చి లో అరెస్ట్ చేయటం..జూన్‌ లో బిర్సాముండాను మట్టుపెట్టింది బ్రిటీష్ ప్రభుత్వం. అప్పటికి బిర్సా ముండా వయసు కేవలం 25 సంవత్సరాలు.

అలా ఆదివాసీల కోసం..వారి హక్కుల కోసం, భూముల కోసం పోరాడిన గొప్ప నాయకుడిగా..పోరాట యోధుడిగా దేవుడిగా కీర్తించబడుతున్నారు బిర్సాముండా.గిరిజన, ఆదివాసీల ఆరాధ్యదైవంగా ఈనాటికి కీర్తించబడతున్నారు బిర్సా ముండా. ఆయన పుట్టిన రోజున ఆయనకు ఇచ్చే గౌరవంగా 2000 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. అలా జార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భావం..బిర్సా పుట్టిన రోజు ఒకటే అయ్యింది. ఈనాటికి జార్ఖండ్ గిరిజన, ఆదివాసీలతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల గిరిజన, ఆదివాసీలు కూడా బిర్సాముండాను తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు.