తెలంగాణకు రూ.1036 కోట్ల జీఎస్టీ బకాయిలు విడుదల
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పన్ను బకాయిలు విడుదల చేసింది. తెలంగాణకు రూ.1036 కోట్ల జీఎస్టీ బకాయిలు విడుదల అయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పన్ను బకాయిలు విడుదల చేసింది. తెలంగాణకు రూ.1036 కోట్ల జీఎస్టీ బకాయిలు విడుదల అయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పన్ను బకాయిలు విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.35 వేల 298 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి జీఎస్టీ పన్ను బకాయిలను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణకు రూ.1036 కోట్ల జీఎస్టీ బకాయిలు విడుదల అయ్యాయి.
ఆగస్టు నుంచి పరిహారం చెల్లించకపోవడం పట్ల రాష్ట్రాలు అసహనం వ్యక్తం చేశాయి. బుధవారం జరుగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో ఇదే అంశంపై రాష్ట్రాలు నిలదీసే అవకాశం ఉండటంతో ఈ పరిహారం విడుదలు చేయడం గమనార్హం. జీఎస్టీ అమలు తర్వాత కలిగే రెవెన్యూ లోటును ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు కేంద్రం భర్తీ చేయాలని జీఎస్టీ చట్టం చెబుతోంది. 2017, జులై1వ తేదీన జీఎస్ టీ అమల్లోకి వచ్చింది.
పరిహారం రెండు నెలల్లోపు రాష్ట్రాలకు చెల్లించాల్సివుండగా ఈ ఏడాది ఆగస్టు నెలకు సంబంధించిన పరిహారం ఇప్పటి వరకు చెల్లించకపోవడం పట్ల రాష్ట్రాల ఆర్థిక మంత్రులు బహిరంగంగానే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీజేపీయేతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఎల్లుండి జరుగున్న జీఎస్ టీ భేటీలో జీఎస్టీ పన్ను బకాయిల విడుదలపై నిలదీసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిధులు విడుదల కావడం శోచనీయం.