అమేథిలో స్మృతి ఇరానీ నామినేషన్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అయిన అమేథిలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ గురువారం (ఏప్రిల్ 11, 2019) నామినేషన్ దాఖలు చేశారు.

  • Published By: sreehari ,Published On : April 11, 2019 / 09:49 AM IST
అమేథిలో స్మృతి ఇరానీ నామినేషన్

Updated On : April 11, 2019 / 9:49 AM IST

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అయిన అమేథిలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ గురువారం (ఏప్రిల్ 11, 2019) నామినేషన్ దాఖలు చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అయిన అమేథిలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ గురువారం (ఏప్రిల్ 11, 2019) నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ కు పోటీగా స్మృతి బీజేపీ తరపున బరిలో దిగుతున్నారు.

లోక్ సభ ఎన్నికల వేళ.. ఇరానీ తన నామినేషన్ పత్రాలను గౌరిగంజ్ లోని జిల్లా మెజిస్ట్రేట్ కు సమర్పించారు. యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తో కలిసి స్మృతి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అమేథి నియోజవర్గంలో తన మద్దతుదారులతో కలిసి ఇటీవల ఇరానీ నాలుగు కిలోమీటర్ల వరకు రోడ్ షో నిర్వహించారు.

అంతేకాదు.. అమేథిలోని గౌరిగంజ్ లో ఉన్న గెస్ట్ హౌస్ నుంచి స్మృతి ఇరానీ ఖాళీ చేశారు. రాహుల్ కు పోటీగా స్మృతి రెండోసారి పోటీ చేస్తోంది. 2014లో మోడీ ప్రభావం ఉన్నప్పటికీ.. రాహుల్ పై 1.07 లక్షల ఓట్లతో ఇరానీ ఓడిపోయారు. రాహుల్ గాంధీ కూడా అమేథిలో నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

అమేథి కాంగ్రెస్ కు కంచుకోట. 1980 నుంచి ఈ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ ఎక్కువసార్లు విజయం సాధిస్తూ వస్తోంది. ఐదో దశ ఎన్నికల్లో భాగంగా అమేథిలో మే 6 నుంచి పోలింగ్ జరుగనుంది. మే 23న ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు.