కుంభమేళాలో స్మృతి ఇరానీ : మొదటిరోజే గంగా స్నానం

ప్రయాగ్ రాజ్: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. తొలి రోజు ఆమె గంగానదిలో పుణ్యస్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యస్నానమాచరించిన ఫోటోను ఆమె తన ట్విట్టర్ లో పోస్టు చేస్తూ “హరహర గంగే” అని ట్వీట్ చేశారు. నేటి నుండి ప్రారంభమైన కుంభమేళా మార్చి4వరకు జరుగుతుంది. కుంభమేళాకు వచ్చే యాత్రికుల కోసం యూపీ ప్రభుత్వం ఐదున్నర కిలోమీటర్ల మేర 35 స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసింది. మార్చి 4 లోపు దాదాపు 12 కోట్ల మంది ప్రజలు పుణ్య స్నానాలు చేయటానికి వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.