Tamil Nadu : 10 టీ షర్ట్ లు దొంగలించాడు.. ఎక్కడ దాచాడో తెలుసా..? వీడియో వైరల్
టీ షీర్టులు చూపించాలని అక్కడున్న సిబ్బందితో అడిగాడు. వారు చూపెట్టారు. ట్రయల్ చేసుకోవాలని చెప్పి..రూమ్ కు వెళ్లి..వచ్చాడు. ఇలా కొద్దిసేపు చేశాడు. అనంతరం...

Tamilnadu
Youth Tries To Steal 10 T-Shirts : పండుగల సీజన్ రావడంతో..దుకాణాలన్నీ రద్దీ రద్దీగా ఉంటాయి. కొనుగోలు దారులతో షాపులు కిక్కిరిసిఉంటాయి. దీంతో కొంతమంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుంటారు. వస్తువులను చాకచక్యంగా దొంగిలిస్తూ..అక్కడి నుంచి చెక్కెస్తారు. అయితే..కొంతమంది అడ్డంగా బుక్కవుతుంటారు. వారు దాచుకున్న విధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుంది.
Read More : Online Games : ఆన్‌లైన్ గేమ్స్ రిచార్జ్ కోసం దొంగగా మారిన బాలుడు
ఇలాగే ఓ వ్యక్తి చేసిన దొంగతనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా..పది టీషర్టులు దొంగిలిచాడు. తర్వాత..అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఆ షాప్ ఓనర్. కానీ…ఆ చోరీ చేసిన వ్యక్తిపై పోలీసులకు కంప్లైట్ చేయకపోవడం గమనార్హం. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read More : Nara Lokesh : నారా లోకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తమిళనాడు రాష్ట్రంలో…తిరునల్వేలి బస్టాడు సమీపంలో ఓ బట్టల షాపు ఉంది. వినాయక చవిత పండుగ సందర్భంగా..అక్కడ వినియోగదారులతో కిక్కిరిసి ఉంది. ఇదే అదనుగా ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం టీ షీర్టులు చూపించాలని అక్కడున్న సిబ్బందితో అడిగాడు. వారు చూపెట్టారు. ట్రయల్ చేసుకోవాలని చెప్పి..రూమ్ కు వెళ్లి..వచ్చాడు. ఇలా కొద్దిసేపు చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి జారుకోవాలని చూశాడు.
Read More :MS Dhoni: ధోనీ మెంటార్‌గా అందుకే అవసరం
అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో గట్టిగా ప్రశ్నించారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దొంగతనం చేసిన దుస్తులను తీయాలని చెప్పడంతో లుంగీలో దాచుకున్న ఐదు టీ షర్టులు, పైన వేసుకున్న ఐదు టీషర్టులను విప్పి అక్కడ పెట్టేశాడు. షాపుకు సంబంధించిన ఓనర్ దీనిని సెల్ ఫోన్ లో బంధించాడు. ఇది కాస్తా…వీడియో వైరల్ అయ్యింది. దొంగతనం చేసిన వ్యక్తి సెల్వ మాధవ్ గా గుర్తించారు.