’కేసీఆర్‌ ఒక గిఫ్ట్ ఇస్తే.. మేము మూడు గిఫ్ట్‌లు ఇస్తాం’ : సీఎం చంద్రబాబు 

మోడీ, కేసీఆర్‌, జగన్‌లపై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

  • Published By: veegamteam ,Published On : January 18, 2019 / 12:09 PM IST
’కేసీఆర్‌ ఒక గిఫ్ట్ ఇస్తే.. మేము మూడు గిఫ్ట్‌లు ఇస్తాం’ : సీఎం చంద్రబాబు 

మోడీ, కేసీఆర్‌, జగన్‌లపై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

గుంటూరు : ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత జగన్‌లపై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ ఒక గిఫ్ట్ ఇస్తే తాము మూడు గిఫ్ట్‌లు ఇస్తామన్నారు. గిఫ్ట్‌ల కోసం అవినీతి తమ్ముడు జగన్‌ను కేసీఆర్ ఎంచుకున్నారని విమర్శించారు. కేసీఆర్, జగన్ కలిసి తమను ఏమీ చేయలేరన్నారు. 

మోడీతో టీడీపీ బాగున్నంత కాలం కేసీఆర్‌ కూడా బాగానే ఉన్నారని అన్నారు. తర్వాత ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని…ప్రజల కోసం ఎన్ని మాటలైనా పడతానన్నారు. అందరూ కలిసి రాష్ట్రంపై దాడికి వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంపై జరిగే దాడిని ప్రజలంతా తిప్పి కొట్టాలని పిలుపు ఇచ్చారు. 

గుంటూరు జిల్లాలో 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. 50 ఎకరాల చెరువులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తారకరామ సాగర్ గా నామకరణం చేశారు. తారకరామ సాగర్ లో కోడెల శివప్రసాద్ తో కలిసి బోట్ లో సీఎం చంద్రబాబు షికారు చేశారు.