తుపానులు, ఆర్థిక కష్టాల కంటే జగనే పెద్ద సమస్య : చంద్రబాబు
ఏపీకి అతి పెద్ద సమస్య జగనే అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఏపీకి అతి పెద్ద సమస్య జగనే అని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతి : రాష్ట్రానికి అతి పెద్ద సమస్య జగనే అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి తుపానులు, ఆర్థిక కష్టాల కంటే జగనే పెద్ద సమస్యని.. ఈ సమస్యను వదలించుకోవాలన్నారు. కేసీఆర్ తీరు మార్చుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో నిరసన చేసే పరిస్థితులు తెచ్చుకోవద్దని హితవు పలికారు.
టికెట్ దక్కించుకోలేకపోయిన పులపర్తి నారాయణ మూర్తి.. వైసీపీలో చేరుదామనుకొని మనసు మార్పుకున్నారని తెలిపారు. ఏ నాయకుడైనా అతి తెలివి ప్రదర్శిస్తే దండం పెట్టడం మినహా మరేం చేయలేనని అన్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుని పార్టీని మోసం చేద్దామనే ఆలోచనలు సాగవన్నారు.