నాకేం సంబంధం : షర్మిల ఆరోపణలకు బాబు కౌంటర్

  • Published By: veegamteam ,Published On : January 16, 2019 / 03:37 AM IST
నాకేం సంబంధం : షర్మిల ఆరోపణలకు బాబు కౌంటర్

చిత్తూరు: షర్మిల, ప్రభాస్‌ మధ్య ఎఫైర్‌ ఉందంటూ జరుగుతున్న ప్రచారం… రెండు పార్టీల మధ్య మాటలయుద్ధానికి దారితీసింది. వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. షర్మిల చేసిన విమర్శలపై ఏకంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబే స్పందించారు. ఎవరి వ్యక్తిగత జీవితాల్లో తాము జోక్యం చేసుకోబోమని కౌంటర్‌ ఇచ్చారు.

వైసీపీ నాయకురాలు షర్మిల, హీరో ప్రభాస్‌ మధ్య సంబంధం ఉందంటూ సోషల్‌ మీడియాలో సాగుతున్న ప్రచారం టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్‌ హీట్‌ రాజేసింది. రు పార్టీల నేతల మధ్య మాటల  తూటాలు పేలుతున్నాయి. తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందంటూ షర్మిల ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ నేతలు తనపై ప్రచారం  చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. పోస్టులు పెడుతున్న వారిని, వారి వెనుకున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

షర్మిల ఆరోపణలకు ఏపీ సీఎం చంద్రబాబు ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు. ఒకరి వ్యక్తిగత జీవితాల్లో తాము జోక్యం చేసుకోబోమన్నారు. షర్మిల వ్యాఖ్యలు సరికాదన్న చంద్రబాబు.. ఏపీ పోలీసులపై  నమ్మకం లేనప్పుడు రాష్ట్రంలో రాజకీయం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పౌరునిగా ఉండాలని, నమ్మకం లేనప్పుడు పోటీ ఎందుకు చేస్తున్నారంటూ  మండిపడ్డారు చంద్రబాబు.