ఉద్యోగులకు ఇళ్లు, రైతులకు డబ్బులు : బాబు ఎన్నికల వరాలు
అమరావతి: ఎన్నికలకు ముందు వరాల జల్లు కురిపించింది ఏపీ సర్కార్. అన్ని వర్గాల ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడంపై చంద్రబాబు దృష్టి పెట్టారు.

అమరావతి: ఎన్నికలకు ముందు వరాల జల్లు కురిపించింది ఏపీ సర్కార్. అన్ని వర్గాల ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడంపై చంద్రబాబు దృష్టి పెట్టారు.
అమరావతి: ఎన్నికలకు ముందు వరాల జల్లు కురిపించింది ఏపీ సర్కార్. అన్ని వర్గాల ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడంపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2019, జనవరి 21వ తేదీ సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని వర్గాల వారికి ఆకట్టుకునేలా వరాలు కురిపించారు.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు:
* రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న లక్షా 26వేల పేదల ఇళ్లకు రూ. 756 కోట్లు చెల్లింపు
* 1996 -2004 మధ్య కాలంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు రూ.10వేలు
* అనుమతిలేని ఇళ్లకు రూ.60వేలు
* ట్రాక్టర్లు, ఆటోలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు
* ప్రభుత్వంపై రూ.66కోట్లకు పైగా అదనపు భారం
* చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా
* రాజధానిలో నివాసం ఉండే ఉద్యోగులు, అధికారులు, జర్నలిస్టులకు ఇళ్లు
* కేపిటల్ హౌజింగ్ ప్రమోషన్ పాలసీ
* రాజధానిలో జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి 30 ఎకరాలు
* చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని చక్కెర ఫ్యాక్టరీలకు ట్యాక్స్ మినహాయింపు
* చిత్తూరు జిల్లాలో తాగునీటి కోసం 2వేల 685కోట్ల నిధులు
* బందరు పోర్టు అభివృద్ధి కోసం భూమి కొనుగోలుకు ఆమోదముద్ర
* కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని నిర్ణయం
* ఖరీఫ్ నుంచి రైతుకు పెట్టుబడి సాయం
* అగ్రిగోల్డ్ చిన్న డిపాజిట్లు చెల్లింపు
* ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత డీఏ
* వృద్ధులు, వితంతువుల పింఛన్లను వెయ్యి-2వేలకు పెంపు, జనవరి నుంచే అమలు
* కాపులకు 5శాతం రిజర్వేషన్లు
ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్ల అంశంపైనా మంత్రివర్గంలో చర్చించారు. ఆ రిజర్వేషన్లలో కాపులకు 5శాతం, మిగిలిన అగ్రవర్ణాలకు 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.