హైటెక్ హంగులు : ఇది చంద్రబాబు చైతన్య రథం

ఎన్నికల ప్రచారానికి టీడీపీ రెడీ అవుతోంది. హంగులు, ఆర్భాటాలతో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం వాహనాలు సిద్ధం అయ్యాయి. హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. సీసీ, లైవ్ కెమెరాలతోపాటు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వీడియోలు ప్రదర్శించేందుకు భారీ LED స్క్రీన్స్ కూడా అమర్చారు. సీఎం చంద్రబాబు కోసం రెడీ అయిన చైతన్య రధాన్ని గుంటూరు మణిపురంలోని జయలక్ష్మి డిజైనర్స్ ఆవరణలో ప్రదర్శించారు.
రోడ్‌షోలకు అనువుగా దీనిని తయారు చేసినట్లు జయలక్ష్మి డిజైనర్స్ ఎండీ మార్నీ నారయ్య చౌదరి వెల్లడించారు. వాహనంలో అభ్యర్థితోపాటు 30 మందికి అవకాశం ఉంటుందన్నారు. సులువుగా ఎక్కేందుకు మెట్లు, కార్డ్‌లెస్ మైక్, 10వేల మెగావాట్ల సౌండ్‌బాక్స్‌లు ఈ వెహికల్ ప్రత్యేకత.