సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు : జగన్
సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.

సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.
కడప : సొంతమామనే కుట్ర చేసి చంపిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఆయన పాలనలో మనం చూడని అక్రమాలు లేవని విమర్శించారు. పసుపు-కుంకుమ పథకంతో ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను చూశామని చెప్పారు. ఉద్యోగాలు లేక పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్లిపోతున్నారని చెప్పారు. ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. పులివెందులలో మార్చి 22 శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగించారు.
Read Also : పోలీసుల షాక్ : ప్రకాష్ రాజ్ నామినేషన్ పై డైలమా
ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు 10 శాతం కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. సున్నా వడ్డీ రుణాలు లేవు, ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. ఐదేళ్లలో గిట్టుబాటు ధరలు రాని రాష్ట్రాన్ని చూశామని చెప్పారు. చంద్రబాబు హయాంలో కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎదురుచూపులే మిగిలాయన్నారు.
పులివెందులకు ట్రిపుల్ ఐటీ వచ్చింది వైఎస్సార్ వల్లేనని స్పష్టం చేశారు. అంతర్జాతీయ పశుపరిశోధనా కేంద్రం ఆయన హయాంలోనే వచ్చిందని తెలిపారు. ఈ నేలలో నీళ్లను నింపితే బంగారం పండించొచ్చని వైఎస్ చూపించారని గుర్తు చేశారు. పులివెందుల గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. ‘మీరు ఓటు వేస్తే జగన్ ను కేవలం ఎమ్మెల్యే చేయడం కోసం మాత్రమే కాదని.. రాష్ట్ర భవిష్యత్ కోసం నాకు ఓటు వేస్తున్నారని తెలుసుకోవాలి’ అని అన్నారు.
Read Also : ఎన్నికల టైంలో ఐటీ రైడ్స్ ఎలా చేస్తారు : ఈసీకి శివాజీ కంప్లయింట్