వైసీపీ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు… చంద్రబాబు

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా పెడుతున్న మానసిక క్షోభ తట్టుకోలేకే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సోమవారం సెప్టెంబర్ 16వతేదీన గుంటూరులో టీడీపీ ఆఫీసులో మాట్లాడుతూ ఆయన … కోడెల శివ ప్రసాద రావు ఆత్మహత్య తలుచుకుంటే జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పెట్టే మానసిక క్షోభ, శారీరక బాధ, భరించలేని అవమానం తట్టుకోలేక.. కోడెల తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యే చేసుకోవటం జీర్ణించుకోలేక పోతున్నానని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ నుంచి వస్తుంటే బాలకృష్ణ ఫోన్ చేసి కోడెల సూసైడ్ వార్త చెప్పారని …అంతలోనే ఆయన మరణించిన వార్త చెప్పారని అన్నారు.
నరసరావు పేట ప్రాంతంలో పేదవారి డాక్టరుగా, ఒక ఫైర్ బ్రాండ్ గా ఉన్నశివఫ్రసాద రావు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు డాక్టరు వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. హోం మంత్రిగా, పంచాయతీ రాజ్ మంత్రిగా ఏపీ తొలి స్పీకర్ గా ఆయన చేసిన సేవలు గొప్పవని చంద్రబాబు అన్నారు. ఏ ఆస్పత్రి పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు కోరిక మేరకు తాను కట్టించిన బసవతారకం ఆస్పత్రిలోనే ఆయన తుది శ్వాస విడవటం బాధ కలిగిస్తోందని ఆయన ఆవేదనతో చెప్పారు.
గత 3నెలలుగా వైపీసీ ప్రభుత్వం ఆయన్ను వేధింపులకు గురి చేసిందని…ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు చెప్పారు. టైగర్ లా బతికిన వ్యక్తి వైసీపీ ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పెట్టి వేధింపులు తట్టుకోలేక నాకు బాధలు చెప్పుకున్నారని..నిద్రకూడా పట్టట్లేదని అన్నారని…చంద్రబాబు చెప్పుకొచ్చారు. సమస్యలొస్తాయి, పోరాడదామని, దైర్యం చెప్పానని చంద్రబాబు అన్నారు. అవమానాన్ని భరించలేక పోయాడు. భగవంతుడు ఏ మూడ్ లో తీసుకుపోయాడో కానీ కోడెల ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధతో అన్నారు.పార్టీ కోసం రాత్రింబవళ్లు పని చేసారని, ఒక సహచరుడిని కోల్పోవటం బాధ కలిగిస్తోందని చంద్రబాబు చెప్పారు. ఒక మనిషి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవటం ఊహించలేక పోతున్నాను…..ఎంతటి క్షోభకు గురైతే ఈ నిర్ణయం తీసుకుంటాడో …ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి చంద్రబాబు కోరారు.