సంక్షేమ పథకాలతో కొనుగోలు శక్తి పెరిగింది- సజ్జల కీలక వ్యాఖ్యలు
అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వటంతో చాలా కులాల్లో నాయకులు కూడా దొరకని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో జగనా? చంద్రబాబా? అనేది తేల్చుకోవాలి.

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy : సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన రాష్ట్రంగా ఏపీని సీఎం జగన్ తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా సామాన్యుల కొనుగోలు శక్తి పెరిగిందని ఆయన కామెంట్ చేశారు. టీడీపీ ఎంత విష ప్రచారం చేసినా.. వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలిసి వచ్చిందన్నారు సజ్జల.
”వైసీపీ డీఎన్ ఏలో మైనార్టీలు ఉన్నారు. ఇది రాజశేఖర్ రెడ్డి నుండి జగన్ వరకు వస్తోంది. అందుకు తగినట్టే పార్టీ విధానాలు ఉంటున్నాయి. అందుకే ప్రభుత్వం నుండి సహాయం అందుకుంటున్నారు. సునామీలా వస్తున్న ఆదరణని పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్లి రెండు బటన్లను నొక్కించాలి.
రాబోయే 50 రోజుల్లో ఇదే మన పని. టార్గెట్ క్లియర్ గా ఉంది. పరీక్షల దగ్గరికి వచ్చినపుడు ఎలా పనిచేస్తామో.. అలానే ఇప్పుడు పని చేయాలి. చిన్నపాటి వివక్ష కూడా లేకుండా ప్రభుత్వం పని చేసింది.
2019 వరకు చంద్రబాబు ముఠా చేసిన అరాచకాన్ని చూశాం. అందుకే ప్రజలు మనకు పట్టం కట్టారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మైనార్టీలకు ఇచ్చాము. ఇకపై మైనార్టీలను అన్ని వర్గాలకు నాయకులను చేస్తాం. ఆ దిశగా పని చేస్తున్నాం. మైనార్టీలకు 50శాతం పదవులు ఇచ్చాము.
అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వటంతో చాలా కులాల్లో నాయకులు కూడా దొరకని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో జగనా? చంద్రబాబా? అనేది తేల్చుకోవాలి.
ఓట్ల కోసం షాదీ తోఫా నిబంధనలు మార్పు చేయటానికి కూడా జగన్ అంగీకారo చెప్పలేదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మహిళలకు ఉచిత బస్సు, షాదీ తోఫా నిబంధన సడలింపు ఇవ్వాలని జగన్ విశ్వసించడం లేదు. చంద్రబాబు జైలుకి వెళ్ళారు, బెయిల్ పై వచ్చారని జనం మర్చిపోయారు. రోగాలు ఉన్నాయని జైలు నుండి బెయిల్ పై వచ్చిన చంద్రబాబు.. ఈరోజు యువకుడిలా ఊర్లలో తిరుగుతున్నారు” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Also Read : పైకి పొత్తులు.. లోపల కత్తులు..? టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యానికి కారణం అదేనా?