నారా లోకేష్ ఇసుక దీక్ష

  • Published By: chvmurthy ,Published On : October 30, 2019 / 07:34 AM IST
నారా లోకేష్ ఇసుక దీక్ష

Updated On : October 30, 2019 / 7:34 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ గుంటూరు లో దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి  వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆకలి బాధలతో   ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వైసీపీ ప్రభుత్వం  రాష్ట్రంలో ఎక్కడా ఆకలి చావులు లేవని చెబుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సాయంత్రం గం.5 లవరకు దీక్ష కొనసాగుతుంది. 

రాష్ట్రంలో ఇసుక కొరతపై విపక్షాలు చేస్తున్నరాధ్ధాంతంపై సీఎంజగన్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక వారోత్సవారు నిర్వహించి అడిగిన అందరికీ ఇసుక సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపోందించారు.