మహిళలు ఆశీర్వదించారు : టీడీపీ విజయం ఖాయం

చిత్తూరు : ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ గెలుపు ఖాయం అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. మరోసారి చంద్రబాబు సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఆశీర్వదించారని, టీడీపీ గెలుపు పక్కా అని అయ్యన్న అన్నారు.
Also Read : బీజేపీకి షాక్ : కాంగ్రెస్ లో చేరిన ఎంపీ ఉదిత్ రాజ్
అయ్యన్నపాత్రుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని చెప్పారు. వైసీపీ ఓటమి ఖాయమని తెలిసినా.. ఆ పార్టీ వాళ్లు గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్నారని అయ్యన్న విమర్శించారు. పసుపు-కుంకుమ, వృద్ధాప్య పెన్షన్లు టీడీపీకి ప్లస్ కానున్నాయని చెప్పారు.
ఏపీలో ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. 80శాతం ఓటింగ్ జరిగింది. పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలం అని టీడీపీ, వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. టీడీపీకి 130కిపై స్థానాలు వస్తాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని ఈసారి తమకే పట్టం కడతారని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. అంతిమంగా ఓటర్ తీర్పు ఏంటో మే 23న తెలియనుంది.
Also Read : విపక్షాలను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తుకొస్తున్నారు