Nirmala sitharaman comments row: నిర్మలా సీతారామన్ తీరు నన్ను భయపెట్టింది: కేటీఆర్

కలెక్టర్‌తో నిర్మలా సీతారామన్ ప్రవర్తన తనను భయపెట్టిందని కేటీఆర్ చెప్పారు. కష్టపడి పనిచేసే ఐఏఎస్ అధికారులను రాజకీయ వీధి నాటకంలో భాగంగా నేతలు నిరుత్సాహపరుస్తారని ఆయన విమర్శించారు. అయినప్పటికీ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ హుందాగా వ్యవహరించిన తీరుకు అభినందనలు తెలుపుతున్నానంటూ కేటీఆర్ చెప్పారు. 

Nirmala sitharaman comments row: నిర్మలా సీతారామన్ తీరు నన్ను భయపెట్టింది: కేటీఆర్

Kalvakuntla Taraka Rama Rao on Procurement

Updated On : September 3, 2022 / 9:30 AM IST

Nirmala sitharaman comments row: కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌ తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రవర్తించిన తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. జితేశ్ వీ పాటిల్‌ కు ఆయన మద్దతుగా నిలిచారు. నిన్న కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సీతారామన్.. వీ పాటిల్ తో మాట్లాడుతూ ఉచిత రేషన్ బియ్యంలో కేంద్ర వాటా ఎంత? అని అడిగిన విషయం తెలిసిందే. ఆయన సమాధానం చెప్పలేకపోవడంతో.. ఐఏఎస్ అధికారి అయినప్పటికీ ఈ విషయం తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, రేషన్ షాపు వద్ద ఫ్లెక్సీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటో కూడా లేకపోవడంతో నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తోందని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. దీనిపై కేటీఆర్ ట్విటర్ లో స్పందిస్తూ… కలెక్టర్‌తో నిర్మలా సీతారామన్ ప్రవర్తన తనను భయపెట్టిందని చెప్పారు. కష్టపడి పనిచేసే ఐఏఎస్ అధికారులను రాజకీయ వీధి నాటకంలో భాగంగా నేతలు నిరుత్సాహపరుస్తారని ఆయన విమర్శించారు. అయినప్పటికీ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ హుందాగా వ్యవహరించిన తీరుకు అభినందనలు తెలుపుతున్నానంటూ కేటీఆర్ చెప్పారు.

Rains in telangana: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం