రాధా సంచలనం : నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు

వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. నన్ను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారు అని రాధా అన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు రకరకాల గ్రూప్‌లు క్రియేట్ చేసి

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 07:16 AM IST
రాధా సంచలనం : నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు

Updated On : January 24, 2019 / 7:16 AM IST

వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. నన్ను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారు అని రాధా అన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు రకరకాల గ్రూప్‌లు క్రియేట్ చేసి

విజయవాడ : వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. నన్ను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారు అని రాధా అన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు రకరకాల గ్రూప్‌లు క్రియేట్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా దాడులకు భయపడి పారిపోను అని వంగవీటి రాధా తేల్చి చెప్పారు. వైసీపీలో నాకు చాలా అవమానాలు జరిగాయని రాధా వాపోయారు. నా తండ్రి విగ్రహం పెట్టడానికి వైసీపీ పర్మిషన్ కావాలా? అని ప్రశ్నించారు. తమ్ముడు లాంటి వాడిని అని అంటూనే తనను చాలా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావని జగన్ ఎగతాళి చేశారని అన్నారు. తన తండ్రి ఆశయ సాధన కోసమే వైసీపీ నుంచి బయటకు వచ్చేశానని రాధా వివరించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజాజీవితంలో కొనసాగాలని అనుకుంటున్నట్టు రాధా చెప్పారు.

 

జగన్‌పైనా రాధా తీవ్ర విమర్శలు చేశారు. నేనే సర్వం, నేను చెప్పిందే వేదం అనే వైఖరి జగన్‌ది అని మండిపడ్డారు. జగన్‌కు ఎమ్మెల్యేలంటే గౌరవం లేదన్నారు. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వని పార్టీలో ఎలా ఉండాలని అని రాధా ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలన్నారు. తన తండ్రి వంగవీటి రంగాను అభిమానించే వాళ్లు అన్ని పార్టీల్లో ఉన్నారని రాధా చెప్పారు. తన తండ్రి  ఆశయాలను నెరవేరుస్తానని రాధా స్పష్టం చేశారు.