Rohit Sharma dinner promise : ఏమయ్యా అక్షర్.. ఇంతకు నిన్ను రోహిత్ శర్మ డిన్నర్‌కి తీసుకువెళ్లాడా? లేదా?
అక్షర్ పటేల్‌కు రోహిత్ శర్మ తాను ఇచ్చిన డిన్నర్ హామీని నిలబెట్టుకున్నాడా? లేదా? అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది.

Champions Trophy 2025 Axar Patel finally reveals whether Rohit Sharma kept his dinner promise
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ2025లో సెమీస్‌కు చేరుకుంది. ఇక టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కు కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన డిన్నర్ హామీని నిలబెట్టుకున్నాడా? లేదా అన్న మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం దొరికింది.
ఛాంపియన్స్2025లో అక్షర్ పటేల్ కు సువర్ణావకాశం చేజారింది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కొద్దిలో హ్యాట్రిక్ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. అక్షర్ పటేల్ వరుస బంతుల్లో తంజిద్, ముష్పికర్ వికెట్లు సాధించాడు. హ్యాట్రిక్ ముంగిట నిలిచాడు. జాకీర్ అలీ క్రీజులోకి రాగా అద్భుతమైన బంతిని వేశాడు. జాకీర్ బ్యాట్ అంచును తగిలిన బంతి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ చేతుల్లో పడింది.
అయితే.. ఎంతో ఈజీ క్యాచ్‌ను రోహిత్ శర్మ మిస్ చేశాడు. దీంతో అక్షర్ హ్యాట్రిక్ మిస్సైంది. క్యాచ్ మిస్ కావడంతో అసహనానికి గురైన రోహిత్ శర్మ.. గ్రౌండ్‌లోనే నేలపై తన చేతిని పదే పదే కొట్టాడు. ఆ తరువాత క్యాచ్ ను పట్టుకోలేకపోయినందుకు మైదానంలో అక్షర్‌కు రోహిత్ సారీ కూడా చెప్పాడు.
ఇదే విషయమై బంగ్లా మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. క్యాచ్ వదిలివేసినందుకు బదులుగా అక్షర్‌ను డిన్నర్‌కు తీసుకువెళ్తానని మాట ఇచ్చాడు. కాగా.. రోహిత్ శర్మ ఆ క్యాచ్ పట్టి ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో హ్యాట్రిక్ తీసిన రెండో ఆటగాడి అక్షర్ నిలిచేవాడు.
ఆతరువాత అక్షర్ ఒక సోషల్ మీడియా పోస్ట్ తో రోహిత్ కి విందు వాగ్దానం గురించి సరదాగా గుర్తు చేశాడు.
Wickets in the bag, win on the board… @ImRo45 Dinner pending hai 😆😂 pic.twitter.com/udSZnuVbYy
— Axar Patel (@akshar2026) February 21, 2025
ఇది సరైన సమయం అనుకుంటా?
ఇక ఇప్పుడు పాక్‌తో మ్యాచ్ పూర్తి కావడంతో రోహిత్ శర్మ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడా? లేదా అన్న ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. దీనికి అక్షర్ తాజాగా సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు మాకు వారం రోజుల విరామం దొరికింది. మేము సెమీస్‌కు అర్హత సాధించాము. కాబట్టి ఇప్పుడు నా విందు గురించి రోహిత్ ను అడిగే సరైన సమయం ఇదే అని అనుకుంటున్నాను అని అక్షర్ పటేల్ ఐసీసీతో మాట్లాడుతూ చెప్పాడు.
అంటే దాని అర్థం ఇప్పటి వరకు రోహిత్ శర్మ తాను ఇచ్చిన డిన్నర్ మాటను నిలబెట్టుకోలేదు అన్న మాట. చూడాలి మరి హిట్‌మ్యాన్ ఎప్పుడు అక్షర్‌ను డిన్నర్‌కు తీసుకువెలుతాడో.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ స్టేజీలో తన చివరి మ్యాచ్‌ను భారత్ మార్చి2న ఆడనుంది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి టేబుల్ టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టాలని భారత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.