IND vs PAK : కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. తుది జట్లు ఇవే..
దుబాయ్ వేదికగా భారత్, పాక్ తలపడుతున్నాయి.

ICC Champions Trophy 2025 Pakistan opt to bat against India
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మ్యాచ్ ఆరంభమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నారు. అటు పాకిస్తాన్ జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. ఫఖర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ జట్టులోకి వచ్చాడు.
ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. అటు ఈ మ్యాచ్‌లో పాక్ ఓడిపోతే మాత్రం ఆ జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుంది. దీంతో పాక్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్‌గా మారింది.
🚨 Toss 🚨 #TeamIndia have been put in to bowl first
Updates ▶️ https://t.co/llR6bWyvZN#PAKvIND | #ChampionsTrophy pic.twitter.com/31WGTuKFTs
— BCCI (@BCCI) February 23, 2025
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
పాకిస్తాన్ తుది జట్టు..
ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.