IPL 2025: రాజస్థాన్ పై బెంగళూరు విజయం.. ఆర్ఆర్ కు వరుసగా 5వ పరాజయం
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

Courtesy BCCI
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ గెలుపొందింది. 11 పరుగుల తేడాతో ఆర్ఆర్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 206 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్ఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.
Also Read: ‘నిన్ను చంపేస్తాం’.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు
ఈ సీజన్ లో ఆర్సీబీకి మొత్తం 9 మ్యాచులు ఆడింది. 6 విజయాలు నమోదు చేసింది. పాయింట్ల టేబుల్ లో 3వ స్థానంలో ఉంది. అటు రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడింది. ఏడు మ్యాచుల్లో ఓడింది. పాయింట్ల టేబుల్ లో 8వ స్థానంలో ఉంది.