IPL2022 DC Vs GT : చితక్కొట్టిన గిల్, ఢిల్లీ టార్గెట్ 172
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. (IPL2022 DC Vs DT)

Ipl2022 Dc Vs Gt
IPL2022 DC Vs GT : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఢిల్లీ కేపిటల్స్ ముందు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. గిల్ 46 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.
IPL 2022: శామ్ బిల్సింగ్స్ క్యాచ్ అందుకున్నాక కోహ్లీ మూతి మారిపోయిందలా.
కెప్టెన్ హార్దిక్ పాండ్య (31) పరుగులు చేశాడు. రాహుల్ తెవాటియా (14), విజయ్ శంకర్ (13) పరుగులు చేయగా.. మాథ్యూ వేడ్ (1), అభినవ్ మనోహర్ (1) నిరాశ పర్చారు. డేవిడ్ మిల్లర్ (20), రషీద్ ఖాన్ (0) నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు.(IPL2022 DC Vs DT)
IPL 2022 : డివిలియర్స్ రికార్డుకు సమం చేసిన ఎంఎస్ ధోనీ
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుని గుజరాత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. టీ20 లీగ్‌లో అత్యధిక సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైనే ఈ సారి తొలి మ్యాచ్‌లో ఢిల్లీ మట్టికరిపించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న ఢిల్లీని ఢీకొట్టేందుకు గుజరాత్ శాయశక్తులా ప్రయత్నించాలి. ఢిల్లీ బ్యాటింగ్‌లో పృథ్వీషా, రిషభ్ పంత్, రోమన్ పావెల్, టిమ్ సీఫర్ట్ కీలకం కాగా.. బౌలింగ్‌లో శార్ధూల్, ఖలీల్ అహ్మద్, అక్షర్, కుల్‌దీప్, నాగర్ కోటి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాగలరు. శార్ధూల్, అక్షర్ వంటి ఆల్‌రౌండర్లు ఉండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశమే.(IPL2022 DC Vs DT)
IPL 2022: “ఒక్క ఇన్నింగ్స్‌తో బదోనీ సూపర్ స్టార్ అయిపోడు”
హార్దిక్ పాండ్య నేతృత్వంలోని గుజరాత్‌కు గిల్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, వేడ్ వేగంగా పరుగులు చేసే బ్యాటర్లు ఉన్నారు. షమీ, లాకీ ఫెర్గూసన్, హార్దిక్, రషీద్ ఖాన్ వంటి టాప్ బౌలర్లు గుజరాత్ సొంతం. కెప్టెన్ హార్దిక్‌తో పాటు రషీద్ ఖాన్ బ్యాటింగ్ చేయడం గుజరాత్‌కు అదనపు బలం. సమష్టిగా రాణిస్తే ఢిల్లీపై గుజరాత్ పైచేయి సాధించే అవకాశం ఉంది.(IPL2022 DC Vs DT)
IPL2022 RR Vs MI : ఎదురులేని రాజస్తాన్ రాయల్స్.. వరుసగా రెండో విజయం.. ముంబైకి వరుసగా రెండో ఓటమి
జట్ల వివరాలు:
దిల్లీ: పృథ్వీ షా, టిమ్ సీఫర్ట్, మన్‌దీప్ సింగ్, రిషభ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోమన్ పావెల్, శార్ధూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
గుజరాత్: శుభ్‌మన్ గిల్, మ్యాథ్యూ వేడ్ (కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, షమీ