T20 World Cup: ఎల్లుండి బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు దినేశ్ కార్తీక్ దూరం?
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఎల్లుండి బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచుకు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ఆడుతున్న సమయంలో దినేశ్ కార్తీక్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో చివరి ఐదు ఓవర్లు ఉండగా కార్తీక్ ఫీల్డింగ్ నుంచి వైదొలిగాడు.

T20 World Cup
T20 World Cup: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఎల్లుండి బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచుకు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ఆడుతున్న సమయంలో దినేశ్ కార్తీక్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో చివరి ఐదు ఓవర్లు ఉండగా కార్తీక్ ఫీల్డింగ్ నుంచి వైదొలిగాడు.
అనంతరం రిషబ్ పంత్ వచ్చి కీపింగ్ చేశాడు. అతడు వెన్ను నొప్పితో బాధపడుతుండడంతో రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. కార్తీక్ మైనర్ నొప్పితో బాధపడుతున్నప్పటికీ కోలుకునేందుకు దాదాపు 3-5 రోజులు పడుతుంది. అయితే, దినేశ్ కార్తీక్ కి నొప్పి తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అతడి ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పరిశీలిస్తోంది.
అతడు వీలైనంత త్వరగా నొప్పి నుంచి విముక్తి పొందేలా చికిత్స అందిస్తోందని బీసీసీఐ ప్రతినిధి చెప్పారు. కాగా, టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆడిన మూడింటిలో టీమిండియా రెండు మ్యాచులు గెలిచింది. ఎల్లుండి బంగ్లాదేశ్ తో అడిలైడ్ ఓవల్ లో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమిండియా అక్కడకు చేరుకుంది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..